21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్ - సీఎం రేవంత్..!!

ముఖ్యమంత్రి రేవంత్ అనూహ్య ప్రతిపాదన చేసారు. ఎంపీ.. ఎమ్మెల్యేగా పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ప్రస్తుతం 21 ఏళ్లకే ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తయారై దేశాన్ని నడిపిస్తున్నారని చెప్పిన రేవంత్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి 21 ఏళ్లకు పోటీ చేసే విధంగా సవరణ అవసరమని అభిప్రాయ పడ్డారు. ఓటు హక్కు 18 ఏళ్లుగా మారినప్పుడు.. పోటీ వయసు 21కి చేయటం అవసరమని రేవంత్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడించారు.

సీఎం రేవంత్ ఎన్నికల్లో పోటీ చేసే వయసు తగ్గింపు పైన కీలక ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలంటే అర్హత వయసు 25 ఏళ్లుగా ఉందని, ప్రస్తుతం 21 ఏళ్లకే ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తయారై దేశాన్ని నడిపిస్తున్నారని సీఎం రేవంత్​ అన్నారు. వీరు 21 ఏళ్లకే కీలక స్థానాల్లో ఉన్న సమయంలో..21 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ హయాంలో ఓటుహక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. ఓటుహక్కు 21 ఏళ్లు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీకి 25 ఏళ్లుగా ఉందని, ఓటుహక్కు 18 ఏళ్లుగా మారినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి 21 ఏళ్లకు పోటీ చేసే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని రేవంత్​ రెడ్డి అన్నారు.

cm-revanth-suggest-to-allow-election-contesting-age-at-21-with-constitutional-amendment

సీఎం రేవంత్ రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో ఈ వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యేగా 21 ఏళ్లకే పోటీ చేసేలా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ఆమోదింపజేస్తామని సీఎం రేవంత్​ వెల్లడించారు. సీడబ్ల్యూసీ సభ్యుడిగా కాంగ్రెస్‌ పార్టీలోనూ సవరణ అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ మార్పులకు కృషిచేయాలని సల్మాన్‌ ఖుర్షీద్‌ కోరుతున్నట్లు తెలిపారు. దేశాన్ని నడిపేందుకు యువకులకు అవకాశం ఇవ్వాలని, 21 ఏళ్లకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సల్మాన్‌ ఖుర్షీద్‌ బాధ్యత తీసుకోవాలని కోరారు. రాజీవ్‌గాంధీ హయాంలో ఓటుహక్కును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. అదే విధంగా ఎమ్మెల్యేల అర్హత వయసు 21 ఏళ్లకు కుదించాలని రేవంత్ కోరారు. సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డును సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+