వెధవలు, దున్నపోతులు..: కలెక్టర్ తిట్లు, ఎంపిడివోల తిరుగుబాటు

భూపాలపల్లి: ఎంపిడివోలపై కలెక్టర్ తిట్ల దండకం ఎత్తుకున్నారు. దాంతో వారు తిరుగుబాటు బావుటా ఎగురేసారు. "వెధవలు, పనీపాట రాని దున్నపోతులు, ఎక్కువ జీతం తీసుకుంటున్నారు, కనీసం పని కూడా చేతగాదు, మిమ్మల్నందర్నీ ఏంచేయాలి? సస్పెండ్‌ చేయమంటారా?" అంటూ జయశంకరి జిల్లా కలెక్టర్ నోరు పారేసుకున్నారు.

మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో)ను జయశంకర్‌ జిల్లా కలెక్టర్‌ ఆకునూరి మురళి అలా తిట్టారు. దాంతో ఎంపీడీవోలు ఆందోళనకు దిగారు. సామూహిక సెలవులు పెట్టారు. అంతేకాకుండా జిల్లా పరిషత్‌ సీఈవోకు వినతిపత్రం అందించారు.

తాము ఎంపీడీవోలమైన తాము వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం(ఓడీఎ్‌ఫ)లో మండల పారిశుధ్య అధికారులుగా పనిచేస్తున్నామని, ఈ స్థితిలో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ ఓడీఎఫ్‌ను పర్యవేక్షిస్తున్నారని, ఈ సమావేశంలో మాతో మాట్లాడిన తీరు అవమానకరంగా ఉందని వారు వినతిపత్రంలో వివరించారు.

Collecor uses unwanted words against MPDOs

ఆ తిట్లకు సీనియర్‌ ఎంపీడీవోలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని, కలెక్టర్‌ రాష్ట్ర నాయకత్వాన్ని, రాష్ట్ర అధికార గణాన్ని కూడా ప్రభుత్వ కార్యాక్రమాల్లో అవమానపరిచేలా, ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని వారన్నారు.

ఇదిలావుంటే, జయశంకర్‌ జిల్లా గణపురం ఎంపీడీవో శ్రీధర్‌స్వామిని కలెక్టర్‌ బుధవారం సస్పెండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఓడీఎఫ్పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు శ్రీధర్‌స్వామి హాజరుకాలేదు. సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉండడంతో ఆగ్రహించిన కలెక్టర్‌ ఆయన్ను సస్పెండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+