Huzurabad: కౌశిక్ రెడ్డి మానసిక స్థితి బాలేదు.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు..
హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి తీరు వివాదాస్పదంగా ఉంది. ఆయన ఎన్నికల ప్రచారం చివరి రోజు చేసిన వ్యాఖ్యలో వివాదం చెలరేగింది. "మాకు ఓటేయకుండా ఇక మీ ఇష్టం. మా ముగ్గురు శవాలను చూడండి. ఓటేసి గెలిపిస్తే విజయ యాత్రకు వస్తా. లేకుంటే 4వ తేదీ నా శవయాత్రకు రండి అంటూ" కామెంట్ చేశాడు. దీంతో ఇది ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుని విచారణకు ఆదేశించింది.
తాజాగా కౌశిక్ రెడ్డి మానసిక పరిస్థతి బాలేదని ఓ వ్యక్తి కరీంనగర్ లో ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. గెల్లు రాజేందర్ అనే వ్యక్తి కౌశిక్ రెడ్డికి రక్షణ కల్పించాలని కోరాడు. ఇందుకు సంబంధించి కరీంనగర్ కలెక్టరేట్ లో ఎన్నికల అధికారికి హుజురాబాద్ కు ఫిర్యాదు చేశాడు. కౌశిక్ రెడ్డి డిప్రెషన్ లో ఉన్నాడని, అతని మానసిక స్థితి బాగో లేదంటున్నారు. మానసిక స్థితి బాగలేకనే తన భార్య, కూతురుతో సహా తాను కూడా చనిపోతామని కౌశిక్ రెడ్డి చెప్పాడని వివరించాడు.

ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడే వరకు కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరాడు. కౌశిక్ రెడ్డికి మానసిక వైద్య పరీక్షలు చేయించాలని సూచించాడు. కౌశిక్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతే ఎన్నికల అధికారులదేనని తెలిపాడు. కౌశిక్ రెడ్డికి స్థానికంగా వ్యతిరేకత రావడంతో తన కూతురితో కూడా ప్రచారం చేయించాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరికి చనిపోతానని బెదిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
గతంలో కౌశిక్ రెడ్డి గవర్నర్ పై కూడా వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆ తర్వాత చాలా మంది యువకులు కౌశిక్ రెడ్డి తమను వేధించారని చెప్పి మీడియాకెక్కారు. అయితే ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈటల రాజేందర్ బలమైన నేతగా ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ప్రణవ్ పోటీ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి కామెంట్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతోన్నాయి. మానసిక పరిస్థితి సరిగాలేని వ్యక్తితో జాగ్రత్త అంటూ హుజురాబాద్ ఓటర్లను హెచ్చరించాడు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications