సాగర్‌కు పూర్వ వైభవం, చుక్క మురుగు కలవనివ్వం: కెటిఆర్(పిక్చర్స్)

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామావు చెప్పారు. వచ్చే వేసవి నాటికి చుక్క మురుగు నీరు కూడా సాగర్‌లో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రారంభించిన పనులను ఆయన బుధవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం ఒకప్పుడు లేక్స్ సిటీగా పేరుగాంచిందని, అందులో ముఖ్యంగా జంటనగరాలకు హుస్సేన్‌సాగర్ తలమానికంగా ఉండేదని వివరించారు. కాలక్రమేనా ఈ చెరువు కలుషితమైపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్సేన్‌సాగర్‌ను మళ్లీ శుద్ధి చేయాలని, తాగునీరు నింపుకునేందుకు వీలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

అయితే సాగర్‌లో పలు నాలాల ద్వారా మురుగునీరు చేరుతున్నట్లు గుర్తించి, జలమండలి ఆధ్వర్యంలో మురుగునీటిని మళ్లించే పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టామన్నారు. నాలుగు ప్యాకేజీలుగా చేపట్టిన పనుల్లో భాగంగా సుమారు 2.8 కిలోమీటర్ల పొడువున ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న పైప్‌లైన్ నిర్మాణ పనులు ఇప్పటి వరకు రెండు కిలోమీటర్ల వరకు పూర్తయిందని, మిగిలిన 0.8 పొడువు పైప్‌లైన్ పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని వివరించారు.

భవిష్యత్తులో మళ్లీ ఎపుడూ కూడా మురుగునీరు చెరువులో చేరకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే వేసవి కల్లా సాగర్‌ను మంచినీటితో నింపే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశామని మంత్రి కెటిఆర్ వివరించారు. పనులు రికార్డు సమయంలో పూర్తయవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. గండిపేట చెరువు అభివృద్ధి కోసం కూడా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. సాగర్ ప్రక్షాళన పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఇందుకు గాను ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా ఎప్పటికపుడు పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

నాలా మ్యాప్

నాలా మ్యాప్

హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామావు చెప్పారు. వచ్చే వేసవి నాటికి చుక్క మురుగు నీరు కూడా సాగర్‌లో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

నాలా పనులు

నాలా పనులు

హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రారంభించిన పనులను ఆయన బుధవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి తనిఖీ చేశారు.

మంత్రుల తనిఖీలు

మంత్రుల తనిఖీలు

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం ఒకప్పుడు లేక్స్ సిటీగా పేరుగాంచిందని, అందులో ముఖ్యంగా జంటనగరాలకు హుస్సేన్‌సాగర్ తలమానికంగా ఉండేదని వివరించారు. కాలక్రమేనా ఈ చెరువు కలుషితమైపోయిందన్నారు.

మంత్రుల తనిఖీలు

మంత్రుల తనిఖీలు

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్సేన్‌సాగర్‌ను మళ్లీ శుద్ధి చేయాలని, తాగునీరు నింపుకునేందుకు వీలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

మంత్రుల తనిఖీలు

మంత్రుల తనిఖీలు

అయితే సాగర్‌లో పలు నాలాల ద్వారా మురుగునీరు చేరుతున్నట్లు గుర్తించి, జలమండలి ఆధ్వర్యంలో మురుగునీటిని మళ్లించే పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టామన్నారు.

మంత్రుల తనిఖీలు

మంత్రుల తనిఖీలు

నాలుగు ప్యాకేజీలుగా చేపట్టిన పనుల్లో భాగంగా సుమారు 2.8 కిలోమీటర్ల పొడువున ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న పైప్‌లైన్ నిర్మాణ పనులు ఇప్పటి వరకు రెండు కిలోమీటర్ల వరకు పూర్తయిందని, మిగిలిన 0.8 పొడువు పైప్‌లైన్ పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+