అసెంబ్లీ చరిత్రలో తొలిసారి: నా స్టోరీ కాదు... వైయస్ దుమ్ముదులిపిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ చరిత్రలో తొలిసారి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన గురువారం శాసన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కెసిఆర్ కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తూ స్వయంగా వివరించనున్నారు.
అసెంబ్లీ చరిత్రలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇదే తొలిసారి. ప్రజెంటేషన్ కోసం దాదాపు రెండు నెలలు కసరత్తు చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పటి వరకు ఎవరూ అసెంబ్లీలో ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది.
అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొత్తదని, అలా కెసిఆర్ చేస్తే, తమకూ అవకాశం ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, టిడిపిలు సభను బహిష్కరించాయి. బిజెపి సభకు హాజరైంది. స్పీకర్ ఎదురుగా ఒకటి, అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఎదురుగా రెండు స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

ప్రాజెక్టుల రీడిజైనింగుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయమై.. సంబంధిత అంశాలపై మంత్రి హరీశ్ రావు, నీటిపారుదల ఉన్నతాధికారులు, సలహాదారులతో బుధవారం ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు.
అయితే సభలో ఇలాంటిది నిబంధనలకు విరుద్ధమని, దృశ్య, శ్రవణ ప్రదర్శన ద్వారా సభలో చర్చ ప్రారంభించడం పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ లేదని కాంగ్రెస్, టిడిపిలు కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాయి.
మరోవంక, కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం దాదాపు ఏర్పాట్లు పూర్తిచేసింది. సభలో మూడు పెద్ద తెరలను ఇందుకోసం సిద్ధం చేశారు. అసెంబ్లీ గ్యాలరీలో కూర్చొనీ కూడా చూడొచ్చు. సుమారు రెండుగంటల పాటు కార్యక్రమం ఉంటుందని, ఇది పూర్తయ్యాక విరామమిచ్చి మళ్లీ సభను ప్రారంభిస్తారని, సభ్యుల ప్రశ్నలకు తిరిగి సమాధానం ఇస్తారు.
కాగా, కెసిఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై శాసన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన చంద్రబాబు, వైయస్ రాజశేఖర రెడ్డి తదితరులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల విషయంలో వైయస్ కుట్ర చేశారని ఆరోపించారు.
కొమురం భీం పూర్తి చేస్తాం
తెలంగాణకు కాశ్మీర్‌లా ఉండే జిల్లా అదిలాబాద్ అన్నారు. అదిలాబాదులో వలసలు పోయే పరిస్థితి ఉందన్నారు. అదిలాబాదులో ఆరు ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. వాటిని పూర్తి చేస్తామన్నారు. కొమురం భీం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
అదిలాబాదు జిల్లాలో వర్షపాతం ఎక్కువ ఉన్నా పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్నారు. ర్యాలవాగు, మత్తడి వాగులను ప్రస్తుత సీజన్లో పూర్తి చేస్తామన్నారు. గొల్లవాగు, నీలివాయి, జగ్నాథపూర్ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు.
ప్రాణహిత - చేవెళ్లను చేపట్టాలని సమైక్య పాలకులకు ఏ కోశాన లేదన్నారు. ఈ ప్రాజెక్టు పైన మూడు నాలుగు జిల్లాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల వెనుక భయంకర కుట్ర దాగి ఉందన్నారు. కృష్ణానది వారి సొంతం అన్నట్లు సమైక్య పాలకులు వ్యవహరించారని ధ్వజమెత్తారు.
ఇదీ వైయస్ రాజశేఖర రెట్టి కుట్ర.. నేను చెప్పే స్టోరీ కాదు
శ్రీశైలం ప్రాజెక్టుకు సమైక్య పాలకులు గండి కొట్టారన్నారు. సాయుధ పోలీసుల పహారాలో పులిచింతలను వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారన్నారు. పోతిరెడ్డిపాడును 65వేల క్యూసెక్కుల ఎత్తుకు పెంచారన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు సామర్థ్యం కేవలం 19వేల టీఎంసీలే అన్నారు.
తుమ్మడిహెట్టిని వైయస్ ఆ ప్రాంతంలో పెట్టడానికి పెద్ద కుట్ర ఉందన్నారు. అక్కడ వన్యపాణి సంరక్షణ, భూములు, అంతర్రాష్ట్ర సమస్యలు రావాలనే అలా కట్టారని ధ్వజమెత్తారు. ఇది తాను చెప్పే స్టోరి కాదని, సీడబ్ల్యూసీ చెప్పిందని చెప్పారు. మహారాష్ట్రతో పంచాయతీ తెగొద్దని, తద్వారా తుమ్మిడిహెట్టి పూర్తి కావొద్దని చూశారన్నారు. ఒకవేళ అన్ని సమస్యలు పూర్తయి తుమ్మిడిహెట్టిని పూర్తి చేసినా నీళ్లు దవళేశ్వరంకు వెళ్లేలా డిజైన్ చేశారన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులు అంటేనే సమైక్య పాలకులకు వన్యపాణి సంరక్షణ కేంద్రం, అంతర్రాష్ట్ర తగాదాలు వచ్చి పడతాయన్నారు. ఇది కుట్రలు కావా అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ, కిన్నెరసాని.. ఇలా ఏ ప్రాజెక్టు చూసినా ఏదో ఒకటి చెప్పి ప్రాజెక్టులు పూర్తి కాకుండా చేశారన్నారు.
హైదరాబాద్ నగరంలో రెండు సరస్సులు నిర్మిస్తామన్నారు. శామీర్ పేట వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో ఓ జలాశయం నిర్మిస్తామన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద రాచకొండ గుట్టల్లో 20 టీఎంసీల సామర్థ్యంతో మరో జలాశయం నిర్మిస్తామన్నారు.
ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీది ఓ మాట ఉంటది, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీది మరో భాష ఉంటదన్నారు. తుమ్మిడిహెట్టిని 152 మీటర్లకు పెంచితే బాగుంటదని మహా కాంగ్రెస్ అంటే, 148 ఉంటే ఊరుకోమని తెలంగాణ కాంగ్రెస్ అంటుందన్నారు.
జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ లేదన్నారు. అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఒక్క మాట పైన ఉన్నారని చెప్పారు.
ఓ ప్రాజెక్టు విషయమై కెసిఆర్ మాట్లాడుతూ.. చంద్రపురి జిల్లాలో మహా సీఎం ఫడ్నవీస్ కుటుంబం ఉంటుదని, వారికి భూమి ఉందని, ఓ ప్రాజెక్టు వద్దని నేను నాడు ప్రతిపక్ష నేతగా అడ్డుకున్నానని, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా దానిని చేపడితే, కాంగ్రెస్ తనను ప్రశ్నిస్తుందన్నారు. తాను రెండు రకాలుగా మాట్లాడనని చెప్పారన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications