టికెట్ల ఖరారు పై కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ..!!
తెలంగాణలో పార్టీ పరిణామాలను హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోంది. నేతల వ్యవహార శైలి పైన కన్నేసింది. కర్ణాటక తరువాత తెలంగాణ తమ లక్ష్యంగా కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ప్రతీ నిర్ణయం ఆచితూచి తీసుకుంటోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులు..నేతల వ్యాఖ్యల పైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. పార్టీ మేనిఫెస్టో మొదలు టికెట్ల ఖరారు పైనా తాజాగా పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసింది. టికెట్ల పైన అంతిమ నిర్ణయం పార్టీ హైకమాండ్ దేనని కీలక నేతలకు తేల్చి చెప్పింది.
తెలంగాణపై కాంగ్రెస్ నజర్: తెలంగాణలో పార్టీ పరిణామాలపైన సర్వే సంస్థలు...వ్యూహకర్తలు ఎప్పటికప్పుడు హైకమాండ్ కు నివేదికలు ఇస్తున్నారు. అందులో భాగంగా కొందరు నేతలు తమ అనుయాయులు..అనుచరవర్గానికి టికెట్ల పైన హామీలు ఇస్తున్న వ్యవహారం పార్టీ అధినాయకత్వం వద్దకు చేరింది. దీని పైన తాజాగా హైకమాండ్ ముఖ్యులను కలిసిన పార్టీ నేతలకు తమ వైఖరి స్పష్టం చేసింది.

ఎలాగైనా అధికారంలోకి రావటమే లక్ష్యంగా మినిట్ టు మినిట్ పార్టీ వ్యవహారాల పైన మైక్రో లెవల్ నుంచి సమాచారం సేకరిస్తోంది. టీపీసీసీ చీఫ్ నుంచి ఏ నేత పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో గత తొమ్మిదేళ్ల కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగిన అంశాన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదికలు ఇచ్చాయి.
టికెట్ల పంపిణీపై క్లారిటీ: అనుగుణంగా ఏ ఒక్కరినీ విస్మరించకుండా అందిరికీ సముచిత ప్రాధాన్యత ఇచ్చేలా మేనిఫెస్టో రూపకల్పనకు పార్టీ సిద్దం అవుతోంది. బీఆర్ఎస్ పైన ఏ వర్గాల్లో వ్యతిరేకత ఉందనేది పార్టీ ఆరా తీస్తోంది. పేదలు, మధ్యతరగతి, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనేలా మేనిఫెస్టో సిద్దం చేయాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ టికెట్ల పైన కొందరు నేతలు హామీలు ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తల పై హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.
కొందరు ముఖ్య నేతలు తామే టికెట్లు ఇప్పిస్తామంటూ చెబుతున్న మాటల ను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. గెలుపే ప్రామాణికంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని ఖరాఖండిగా పార్టీ ముఖ్య నేతలకు తేల్చి చెప్పింది. నేతల సిఫార్సులకు ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేసింది. నేతల వారసులకు కానీ, ముఖ్యుల అనుచరులకు కానీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదంటూ పార్టీ నాయకత్వం తేల్చేసింది.
సిఫార్సులకు నో: ప్రాంతీయ..సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొన్ని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే గెలుపు మాత్రమే లక్ష్యంగా టికెట్ల ఖరారు ఉంటుందని తేల్చేసింది. ముఖ్య నేతలకు మద్దతుగా నిలిస్తే టికెట్లు ఖాయమనే భావనలో ఉన్న నేతలకు పార్టీ తాజా నిర్ణయం మింగుడు పడటం లేదు. ప్రజలతో మమేకం అయిన నేతలకు..కార్యకర్తల్లో గుర్తింపు ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందని దిశా నిర్దేశం చేసింది.
ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ను పార్టీ అధినాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. టికెట్ల విషయం లో ఏ ఒక్కిరికీ అధికారం, సిఫార్సులకు అవకాశం లేకుండా క్షేత్ర స్థాయి సమాచారం, పార్టీకి చేసిన సేవ, ప్రజల్లో పలుకుబడి, ప్రజల్లో గ్రాఫ్, కార్యకర్తలతో సంబంధాలు ఇలా అన్ని అంశాల ను పరిగణలోకి తీసుకొని టికెట్ల ఖరారు ఉంటుందని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు పార్టీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ ముఖ్య నేతల్లో హాట్ టాపిక్ గా మారింది.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications