కొండా సురేఖను కాపాడుకునేందుకు తెర వెనక, కీలక పరిణామాలు..!!
ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ పరిణామాలు ఆసక్తి కరంగా మారాయి. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి పైన వేటు దిశగా కసరత్తు కొనసాగుతోంది. సీఎం రేవంత్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. హైకమాండ్ తో చర్చలు చేయనున్నారు. వీరిద్దరి పైనా చర్యలు ఖాయమని భావిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ పై వేటు వేస్తే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు. కీలక మంత్రాంగం కొనసాగుతోంది. దీంతో.. ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొండా సురేఖ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. సురేఖ పైన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా సంఘం పార్టీ అధినాయకత్వానికి నివేదించింది. సీఎం రేవంత్ సైతం పార్టీలో క్రమశిక్షణ లోపిస్తే సమస్యలు ఎదురవుతాయని పార్టీకి వివరిస్తున్నారు. సురేఖ పైన వేటు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. సురేఖతో రాజీనామా చేయించటమా.. మంత్రివర్గ విస్తరణలో తప్పించటమా అనేదే నిర్ణయం కావాల్సి ఉందని ముఖ్య నేతల సమాచారం. ఇదే సమయంలో సీఎం రేవంత్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అధినాయకత్వంతో సమావేశాలకు సిద్దం అయ్యారు. పార్టీ నాయకత్వం సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే... భవిష్యత్ లో మరింత నష్టం జరుగుతుందనే అభిప్రాయంతో ఉంది. సురేఖ పైన ఇంత చర్చ జరిగిన తరువాత చర్యలు తీసుకుంటే ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఈ సమయంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు
ఇప్పటికే సురేఖ విషయంలో వేటు వేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలనే సూచన లు సైతం అందుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకున్న సమావేశాల వేళ ఇదే అంశం ముఖ్య నేతల వద్ద తెలంగాణకు ఇద్దరు కీలక నేతలు ప్రస్తావన చేసినట్లు పార్టీ నేతల సమాచారం. ఇప్పటికే సురేఖ పైన వేటు వేస్తే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను వీరు ప్రస్తావిస్తున్నారు. సామాజిక సమీకరణాలు తెర మీదకు వస్తున్నామని చెబుతున్నట్లు తెలుస్తోంది. వేటు తప్పదని భావిస్తే.. తక్షణం చర్యలు తీసుకోకుండా మంత్రివర్గ ప్రక్షాళన సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచన చేసినట్లు సమాచారం. అయితే, సీఎం రేవంత్ మద్దతు దారులు మాత్రం సురేఖ పైన చర్యలు తీసుకోవాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు పార్టీ హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయం పైన పార్టీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications