చేసిందేమీ లేదు: డిఎస్‌పై భగ్గుమన్న ఆకుల లలిత
నిజామాబాద్: కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన సీనియర్ నేత డి. శ్రీనివాస్‌పై కాంగ్రెసు ఎమ్మెల్సీ ఆకుల లలిత భగ్గుమన్నారు. డి. శ్రీనివాస్ తమకు చేసిందేమీ లేదని ఆమె అన్నారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ పిసిసి అధ్యక్షుడు ఇప్పించారని ఆమె చెప్పారు.
బలహీనవర్గాలకు న్యాయం చేశామని అంటున్న డి. శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎంత మందిని పైకి తెచ్చారో చెప్పాలని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా డిఎస్ చేసారని, తాను డిఎస్ శిష్యురాలిని కాబట్టి ఊరుకున్నానని ఆమె చెప్పారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర కారణంగానే ఆనాడు కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో డి. శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేశారనే అభిప్రాయంపై ఆమె ఆ విధంగా అన్నారు.
తనను సంప్రదించకుండానే ఆకుల లలిత పేరును ఎమ్మెల్సీ పదవికి ఖరారు చేశారని డిఎస్ మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవిని రెన్యూవల్ చేస్తారని డిఎస్ ఆశించారు. అయితే, ఆయనను కాదని కాంగ్రెసు నాయకత్వం ఎమ్మెల్సీ పదవికి ఆకుల లలిత పేరను ఖరారు చేసింది.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications