వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిట్టింగ్ స్థానం చేజార్చుకున్న కాంగ్రెస్.. డిపాజిట్ కూడా కోల్పోయిన వైనం

|
Google Oneindia TeluguNews

సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. మునుగోడు నియోజకవర్గాన్ని చేజార్చుకుంది. రాజీనామా చేసి.. బీజేపీ నుంచి బరిలోకి దిగిన రాజగోపాల్ రెడ్డి కూడా ఓడిపోయారు. తొలిసారి అధికార పార్టీ అధికారం చేపట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. పాల్వాయి స్రవంతికి కార్యకర్తలకు పనిచేసినా.. నేతలు ఆశించిన మేర సపోర్ట్ చేయలేదు. అందుకే ఆశించిన ఓట్లు రాలేదు.

మునుగోడు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్‌ కూడా ద‌క్కించుకోలేదు. 15 రౌండ్ల‌లో ఏ ఒక్క రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌లేదు. మొద‌టి నుంచి చివ‌రి రౌండ్ వ‌ర‌కు మూడో స్థానంలో ఉండింది. అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి.. కౌంటింగ్ కేంద్రం నుంచి ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత కౌంటింగ్ కేంద్రం వైపు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు.

congress party loss deposite at munugode by poll

డిపాజిట్ కోల్పోవ‌డంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. సిట్టింగ్ స్థానం కోల్పోవడమే గాక.. డిపాజిట్ కూడా దక్కకపోవడం ఆశ్చర్యం కలిగింది. మునుగోడు ఉప ఎన్నిక‌లో 2,41,805 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,25,192 ఓట్లు.. అంటే 93 శాతం వరకు పోలయ్యాయి.

చెల్లుబాటు అయిన ఓట్ల‌లో 1/6 వంతు వస్తే డిపాజిట్ ద‌క్కుతుంది. తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోతారు. పాల్వాయి స్ర‌వంతి డిపాజిట్ ద‌క్కించుకోవాలంటే 37,532 ఓట్లు రావాల్సి ఉంది. కేవ‌లం 21 వేల పైచిలుకు ఓట్లు స్ర‌వంతికి పోల‌య్యాయి. దీంతో ధరావతు కోల్పోయారు.

English summary
congress party loss deposite at munugodu by poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X