Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TSRTC: హాట్ సమ్మర్‌లో బెజవాడకు కూల్ బస్సులు(వీడియో)..ఎక్కేందుకు రెడీనా..!

అసలే వేసవి కాలం.. మరికొద్ది రోజుల్లో స్కూళ్లకు సెలవులు ఇస్తారు. వేసవి సెలవుల్లో బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడనున్నాయి. బస్సుల్లో రద్దీ ఎక్కువ అవుతుండటం గమనించిన టీఎస్ఆర్టీసీ ఇప్పటికే అదనంగా కొన్ని రూట్లలో బస్సులను నడుపుతోంది. ప్రయాణికులు ఇబ్బంది పడకూడదనే మంచి ఆలోచన చేసింది. తాజాగా టీఎస్‌ఆర్టీసీ మరో నిర్ణయం తీసుకుంది.

మండుటెండల్లో ప్రయాణం చేయాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఓ వైపు ఉక్కపోత మరోవైపు బస్సుల్లో రద్దీ. ఈ పరిస్థితుల్లో ప్రయాణాలనే రద్దు చేసుకుంటున్నారు కొందరు. ఇకపై ఆ అవసరం ఉండదు. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తమ ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. TSRTC కొత్తగా విద్యుత్‌తో నడిచే బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

tsrtc

విద్యుత్‌తో నడిచే ఈ బస్సుల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కొత్తగా రోడెక్కనున్న ఈ ఎలక్ట్రిక్ బస్సులు అన్నిటిలో ఏసీ ఉంటుంది. దీంతో మండుటెండలో సైతం సురక్షితంగా కూల్ జర్నీ చేసేలా టీఎస్‌ఆర్టీసీ ప్లాన్ చేసింది.ఇక ఈ బస్సులు మే నెల నుంచి రోడ్డు మీదకు రానున్నాయి.దీనికి సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

బస్ భవన్‌లో ఎలక్ట్రిక్ బస్సులను వీసీ సజ్జనార్ పరిశీలించారు. అదే సమయంలో వాటికి సంబంధించిన ప్రత్యేక ఫీచర్స్‌ను వివరించారు. తొలిసారిగా ఒకే సారి 50 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఇవన్నీ నిత్యం రద్దీగా ఉన్న విజయవాడ రూట్లో తిప్పనున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఇక ఇలాంటి బస్సులను తీసుకురావాలని చర్చలు జరిపినప్పుడు పలు కీలక సూచనలను ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ సంస్థకు టీఎస్‌ఆర్టీసీ సూచించింది.

ఈ క్రమంలోనే పర్యావరణానికి హానీ కలగకుండా అదే సమయంలో ప్రయాణికులకు చక్కటి ప్రయాణం అనుభూతి కల్పించేందుకు నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్ల పొడువుతో తయారయ్యాయి. మొత్తం 41 సీట్ల సామర్థ్యం ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 325 కిలోమీటర్ల వరకు ఇబ్బంది లేకుండా బస్సు పరుగులు తీస్తుంది. ఇక ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి సీటు వద్ద ఒక సేఫ్టీ బటన్‌ ఇచ్చారు. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు.

ఈ విద్యుత్ బస్సుల్లో మూడు సీసీటీవీలు ఏర్పాటు చేశారు. దీన్ని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానం చేశారు. దీంతో ఒక నెలరోజుల పాటు డేటాను నిల్వ ఉంచేలా ప్లాన్ చేశారు. రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా, ఎల్‌ఈడీ బోర్డు, మొబైల్ చార్జింగ్ ఫెసిలిటీ, ప్రతి సీట్ వద్ద ఓ లైట్, షార్ట్ సర్క్యూట్ అయితే వెంటనే అలర్ట్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

మొత్తం 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఓలెక్ట్రా సంస్థ గ్రీన్ టెక్ లిమిటెడ్‌కు ఆర్డర్ ఇచ్చింది. వీటికి అదనంగా మరో 1000 బస్సులు అశోక్ లేలాండ్, ఇతర సంస్థలు తయారు చేయనున్నాయి.ఇందులో 50 బస్సులు హైదరాబాద్-విజయవాడ రూట్లలో తిప్పేందుకు నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+