అల్లు అర్జున్ కు కోర్టులో బిగ్ రిలీఫ్- కండీషన్స్ అప్లై..!!
హీరో అల్లు అర్జున్ కు కోర్టులో రిలీఫ్ దక్కింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ రావటంతో అల్లు అర్జున్ తనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చే సారు. అదే విధంగా ప్రతీ వారం పోలీసు స్టేషన్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్దిం చారు. వీటి పైన విచారణ చేసిన నాంపల్లి కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, అల్లు అర్జున్ కు ఈ కేసులో ఉపశమనం లభించింది.
అల్లు అర్జున్ కు బెయిల్ సమయంలో కోర్టు విధించిన షరతుల్లో మినహాయింపు ఇచ్చింది. ప్రతీ ఆదివారం పోలీసు స్టేషన్ లో హాజరు కావాలనే నిబంధనలను సడలించింది. బెయిల్ పొందిన తరువాత ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ హాజరవుతున్నారు. కాగా, అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ చేసిన కోర్టు ఈ మేరకు మినహాయింపు ఇస్తూ నిర్ణయం వెలువరించింది. భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. దీనికి నాంపల్లి కోర్టు అంగీకారం తెలిపింది.

అదే విధంగా అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతించింది. ఇదే సమయంలో అల్లు అర్జున్‌ను విచారణ చేయాలని భావిస్తే నోటీసు ఇచ్చి పోలీసులు విచారణ జరప వచ్చని కోర్టు స్పష్టం చేసింది. భద్రతా కారణాల వల్ల మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు నాంపల్లి కోర్టు వెల్లడించింది.
ఈ కేసు విచారణ దశలో ఉన్న తరుణంలో విదేశాలకు వెళ్లేందుకు వీలులేదని కోర్టు తొలుత చెప్పినా.. తాజాగా అల్లు అర్జున్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు చార్జ్‌షీట్ అయ్యేంత వరకు విచారణ కొనసాగనుంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లు పూర్తి అయ్యాయి. కోర్టు తాజా ఆదేశా లతో కొంత మేర అల్లు అర్జున్ కు రిలీఫ్ దక్కినట్లుగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications