చేపల వలలో ముసలి,కోత్త గూడంలో సంచలనం
చెరువుల్లో నీళ్లు సరిగా లేకపోవడంతో పెద్ద ముసళ్లు సైతం ఒడ్డునపడుతున్నాయి..చెరువులు,వాగుల్లో నీళ్లు లేక రైతుల పోలాల్లోకి వస్తున్నాయి..ఈనేపథ్యంలోనే మంజీర నది ఎండిపోయి ముసళ్లు బయటికి వచ్చిన సంఘటన జరిగిన మరుసటి రోజే చెరువులో చేపల వలకు మరో ముసలి చిక్కింది.

..తాజాగా చెరువులో వేసిన వలకు చిన్నపాటి ముసలి చిక్కిన సంఘటన కోత్తగూడం జిల్లా బూర్గం పాడ్ ప్రాంతంలో కొల్లు చెరువులో జరిగింది. కొల్లు గూడేం కు చెందిన గుండె వెంకన్న గోనేల వెంకటేశ్వర్లు, మరియు ఇతర జాలర్లు చేపలు పడుతుండగా అందులో చిన్న ముసలి వలలోకి వచ్చింది.
దీంతో వెంటనే స్పందించిన జాలర్లు వలలో ఉన్న ముసలి పిల్లను చేపల వల నుండి చేశారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ముసలి పిల్లను నీళ్లు ఉన్న ప్రాంతంలో వదిలేశారు..అయితే చెరువులో ఉన్న తల్లి ముసలిని పట్టుకోవాలని లేదంటే జాలర్లు ఇబ్బంది పడతారని పిర్యాధు చేశారు.












Click it and Unblock the Notifications