కల్చరల్ కార్నివాల్ తో ఆకట్టుకునేలా ఇన్వెస్ట్ తెలంగాణా గ్లోబల్ సమ్మిట్!

తెలంగాణ రాష్ట్రం డిసెంబర్‌లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026ను నిర్వహించనుంది. ఈ సమిట్‌లో పారిశ్రామిక అభివృద్ధితో పాటు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమిట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న సమిట్‌లో జానపద, శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, వివిధ ప్రాంతాల సాంప్రదాయ కళారూపాలు ప్రదర్శనలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, వారసత్వం ప్రత్యేకంగా కనిపించాలని ఆయన అన్నారు.

Cultural carnival in invest telangana to Shine at Global Summit 2026 CS Sanjay Jaju Directs Grand Showcase

సమ్మిట్ లో భాగంగా రక్షా ఎక్స్‌పో కూడా జరుగుతుంది. డిసెంబర్ 9న ఎయిర్ షో ఉంటుంది. ఆ రోజు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా. అందుకని ఆ రోజు ప్రత్యేక కల్చరల్ కార్నివాల్ నిర్వహించి రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా చూడాలని సీఎస్ సూచించారు. జానపద కళలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో ఈ కార్నివాల్ ఉండాలని ఆయన అన్నారు.ప్రచారం విషయంలో కూడా సీఎస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

కర్టెన్ రైజర్ కార్యక్రమాలను ఈ నెల 24న హైదరాబాద్‌లో, 29న ఢిల్లీలో ఘనంగా నిర్వహించాలన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాలు, తెలంగాణ భవన్, ఇతర ముఖ్య ప్రాంతాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే మార్గం, ప్రధాన రహదారులు, స్టార్ హోటళ్లు, కీలక స్థలాల్లో కూడా ప్రచార బోర్డులు పెట్టాలని చెప్పారు.

జాతీయస్థాయి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, సినీ నటులు, సెలబ్రిటీలతో షార్ట్ ఫిల్మ్‌లు తీసి ప్రచారం చేయాలని కూడా సూచించారు.ఈ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతుంది. గత ఏడాది జరిగిన సమ్మిట్ కంటే ఈసారి మరింత పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీకండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం.

రాష్ట్రం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రకారం 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ సమ్మిట్ లో పారిశ్రామిక విధానాలు, నూతన పాలసీలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. బీ2బీ సమావేశాలు, ఎగ్జిబిషన్‌లు, ప్లీనరీ సెషన్లు జరుగుతాయి. రక్షా ఎక్స్‌పో ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పండుగ లాంటి వార్త!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పండుగ లాంటి వార్త!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమ్మిట్ ఏర్పాట్లపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, నవంబర్ చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. తెలంగాణ సంస్కృతి, కళలు, వారసత్వం ఈ సమ్మిట్ లో ప్రత్యేకంగా కనిపిస్తే అంతర్జాతీయ ప్రతినిధులకు రాష్ట్రం గురించి మరింత ఆసక్తి కలుగుతుందని భావిస్తున్నారు. పెట్టుబడులతో పాటు సాంస్కృతిక పర్యాటకానికి కూడా ఇది మంచి అవకాశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+