దొంగ నోట్ల ముఠా అరెస్ట్

హైదరాబాద్: దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని అవకాశంగా తీసుకొని మోసానికి పాల్పడిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఫిలింనగర్‌లో నోట్లు మార్పిడి చేస్తామని మోసానికి పాల్పడిన టపాచబుత్ర సీఐ రాజశేఖర్‌తో పాటు పది మందిని డిసెంబర్‌ 1న అరెస్టుచేసిన బంజారాహిల్స్‌ పోలీసులు మంగళవారం మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 'రూ.80 వేలు కొత్త నోట్లు ఇస్తే రూ.లక్ష పాత నోట్లు ఇస్తామని నిందితులు ప్రచారం చేశారు. ప్రచారం నమ్మిన కొందరు ఈ నెల 1న రూ.1.55 కోట్లు కొత్తనోట్లు తీసుకొని వెళ్లారు. 20శాతం కమీషన్‌ వస్తుందనే ఆశతో కొత్త నోట్లు తీసుకెళ్లారు. అయితే ఆ నలుగురినీ బెదిరించి రూ.52 లక్షలను సీఐ రాజశేఖర్‌, తిరుమలేశ్‌ నాయుడు బృందం తీసుకుంది.'అని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+