సోనియా ఇచ్చింది, కానీ టీఆర్ఎస్ అలా చేసింది: డిఎస్, కెసిఆర్ సెల్యూట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయితే, ఇచ్చేలా చేసింది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని డీ శ్రీనివాస్ బుధవారం అన్నారు. ఆయన కెసిఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆరు దశాబ్దాల పోరాట ఫలితమే తెలంగాణ అన్నారు. సోనియా తెలంగాణ ఇస్తే, ఇచ్చేలా చేసింది కెసిఆర్ అన్నారు. వేరేవారు సీఎం అయితే తెలంగాణను అర్థం చేసుకునేందుకు ఏడాది పట్టేదన్నారు. తనను తిట్టే వాళ్లను తాను విమర్శించదల్చుకోలేదని చెప్పారు.

తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మబలిదానం చేశారన్నారు. ఉద్యమం సమయంలో కెసిఆర్ అందర్నీ ఏకతాటిపైకి తెచ్చారన్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేశారన్నారు. కెసిఆర్ పూర్తి అవగాహనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు.
తన ఆత్మ ప్రభోదానుసారం తాను టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆంధ్రావాళ్లు ప్రతి పనికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. నేను బీఫారం ఇస్తే గెలిచిన వాళ్లు ఇప్పుడు నన్ను తిడుతున్నారన్నారు. బంగారు తెలంగాణలో కెసిఆర్‌కు అండగా ఉంటానని చెప్పారు.

కెసిఆర్ మాట్లాడుతూ... డీఎస్‌తో తనకు 35 ఏళ్ల అనుబంధముందని చెప్పారు. ఆయన రాకను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా అందరూ స్వాగతించారన్నారు. తమ మీద విశ్వాసంతో పార్టీలో చేరిన డీఎస్‌కు నేను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications