Congress: కాంగ్రెస్‍లో టికెట్ల చిచ్చు.. రాజీనామాకు సిద్ధమైన రాజనరసింహ..!
తెలంగాణ కాంగ్రెస్(Congress) లో టికెట్ల చిచ్చు కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాపై పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ(Damodara Rajanarsimha) అసంతృప్తితో ఉన్నారు. తమవారికి టికెట్ రాకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దామోదర రాజనరసింహ ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్ చెరు నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ల కేటాయింపుపై ఆయన అలక బూనినట్లు తెలుస్తోంది.
రాజనరసింహ నారాయణఖేడ్ టికెట్ నుంచి సంజీవరెడ్డి, పటాన్ చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా నారాయణఖేడ్ టికెట్ ను సురేష్ షేట్కార్ ఇవ్వగా.. పటాన్ చెరు టికెట్ ను నీలం మధుకు కేటాయించారు. దీంతో దామోదర రాజనరసింహ ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా పటాన్ చెరు టికెట్ నీలం మధుకు కేటాయించడంపై అసంతృప్తితో ఉన్నారు.

పటాన్ చెరులో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎప్పటి నుంచి పార్టీలో పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీని వీడకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని.. అలాంటి వ్యక్తికి టికెట్ కేటాయించకపోవడంపై రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే పార్టీని వీడడానికి కూడా దామోదర రాజనరసింహ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ నేతలు దామోదర రాజనరసింహతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. నీలం మధు టికెట్ ఇవ్వడం వల్ల ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చని ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఏదైనా పదవి ఇస్తామని హామీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు వనపర్తి నుంచి చిన్నారెడ్డికి టికెట్ రద్దు చేయడంతో ఆయన కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications