చీకటి రోజు.. హరీశ్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్
హైదరాబాద్: ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్రావు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అని అన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతు కోసిందని ఆరోపించారు.
అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు , అక్రమ అరెస్టులు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్ గొంతు నొక్కడం. జగదీశ్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు సస్పెండ్ చేస్తారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సభ్యులు మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే స్పీకర్‌ని వారిని అదుపు చేసి సభా పెద్దగా శాసనసభను క్రమంలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ని ప్రతిపాదించినప్పుడు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పార్టీ పేరు పెట్టింది కేసీఆర్. దేశంలో ఎక్కడా లేనివిధంగా 10 లక్షల దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది కేసీఆర్ అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
అంబేద్కర్ సహా దళితులను అవమానించింది కాంగ్రెస్సే
దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. బాబా సాహెబ్ అంబేద్కర్‌ని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బాబు జగ్జీవన్ రావు.. కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే వారు కొత్త పార్టీ పెట్టుకున్న విషయం కూడా అందరికి తెలుసు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని హరీశ్ రావు విమర్శించారు. అధీర్ రంజన్ చౌదరి, సోనియా గాంధీ.. ద్రౌపది ముర్ముని అవమానించారని చెప్పారు.
స్పీకర్‌కి, శ్రీధర్ బాబుకి బీఆర్ఎస్ పక్షాన శాసనసభ్యులను వెళ్లి వివరణ ఇవ్వడం జరిగింది. జగదీష్ రెడ్డి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు అలా మీరు భావిస్తే రికార్డులను చూపించాలని కోరాం. సభ జరగాలి కాబట్టి మా తప్పు ఉన్నట్లయితే మేము క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పాము అని హరీశ్ రావు తెలిపారు.
ఈరోజు ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభ సమయాన్ని వృధా చేయకుండా ఉండాలని కోరాం. ఉరి తీసేటప్పుడు కూడా మీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. సస్పెండ్ చేసిన సభ్యుని వివరణ కూడా అడగకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తప్పు చేయకపోయినా సభలో క్షమాపణ చెప్తామని కూడా చెప్పాము. పథకం ప్రకారం ముందే అనుకొని బీఆర్ఎస్ సభ్యుని సస్పెండ్ చేశారని హరీశ్ రావు ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా, నియంతృత్వ పోకడలతో జగదీశ్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినందుకు, అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. pic.twitter.com/TApUZQdkXO
— BRS Party (@BRSparty) March 13, 2025
బీఆర్ఎస్ గొంతునొక్కే ప్రయత్నం..
ప్రశ్నించే ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌ను కుట్రపూరితంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ పై జగదీశ్ రెడ్డి ఏక వచనం వాడకపోయినా ఏక వచనం వాడారని సస్పెండ్ చేయడం దుర్మార్గం. కౌల్ అండ్ శక్దర్ పుస్తకంలో ఎక్కడ కూడా (యు) నీ అనే పదాన్ని నిషేధించలేదు.. అయినా సరే మేము ఎక్కడ స్పీకర్ ని ఏకవచంతో సంబోధించలేదు. రాహుల్ గాంధీ మీరు చెప్పే ప్రజాస్వామ్య పరిరక్షణ ఇదేనా? ఇదేనా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అంటే. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో మంత్రి శ్రీధర్ బాబు యాక్షన్ నడుస్తుందని హరీశ్ రావు విమర్శించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications