ఊపందుకున్న దశాబ్ది ఉత్సవాలు.!తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమన్న కవిత.!
నిజామాబాద్/హైదరాబాద్: తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యం, కర్తవ్యం అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేనన్ని అభివృద్ది సంక్షేమ పనులను సీఎం చంద్రశేఖర్ రావు చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని, అందిస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి చామకూర మల్లా రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు.
మంచి పనులే కేసీఆర్ చేశారు : ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడారు.ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు గులాబీ పార్టీ స్థాపించిన నమస్తే తెలంగాణ పత్రికతో పాటు టీ న్యూస్ ఛానల్ ను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్కరు పత్రికను చదివేలా, టీ న్యూస్ ఛానల్ ను చూసేలా ప్రోత్సహించాలని, అందులో వచ్చే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కథనాలను ప్రజలకు తెలియచెప్పాలన్నారు కవిత. మండల స్థాయిలో గ్రామస్థాయిలో అధ్యక్షులు చొరువ తీసుకుని టీ న్యూస్ లో సబ్స్క్రైబ్ చేయించాలని కవిత పిలుపునిచ్చారు.















Click it and Unblock the Notifications