నోట్ల రద్దు: శనివారం వృద్ధులకే స్పెషల్, 2 రోజులు మార్పిడికి అవకాశం లేనట్లే!
రేపు అనగా, శనివారం నాడు దేశంలోని అన్ని బ్యాంకులలోను కేవలం వృద్ధులకే నగదు మార్పిడికి అవకాశం కల్పించనున్నారు.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి నేపథ్యంల ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు వృద్ధుల కోసం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి. రేపు (శనివారం) నాడు అన్ని బ్యాంకులలోను నోట్ల మార్పిడిని కేవలం వృద్ధులకే కేటాయించనున్నారు.
రేపు ఒక్కరోజు దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లు తమ పెద్ద నోట్లను మార్చుకునేందుకు, ఇతర లావాదేవీలను నిర్వహించుకునేలా బ్యాంకులు అవకాశం కల్పించాయి. బ్యాంకు లావాదేవీలు, నగదు మార్పిడికి కేవలం వృద్ధులను మాత్రమే అనుమతిస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఆదివారం బ్యాంకులకు సెలవు దినం కావడంతో వరుసగా రెండు రోజుల నోట్ల మార్పిడికి అవకాశం లేనట్లే.

ఓ విధంగా శనివారం అన్ని బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసారనే చెప్పవచ్చు. వృద్ధులకు మినహాయింపునిచ్చారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఛైర్మన్ రాజీవ్ రుషి వెల్లడించారు.
అయితే, మిగిలిన అన్నీ లావాదేవీలు యథావిధిగా నడుస్తాయని, రేపు బ్యాంకులు తమ పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటాయన్నారు. నగదు మార్పిడి కోసం వస్తున్నవారికి సిరా చుక్కపెట్టడం వల్ల బ్యాంకుల్లో రద్దీ దాదాపు నలభై శాతం మేర తగ్గిందన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications