Telangana: రాష్ట్రంలో పెరిగిన డెంగ్యూ కేసులు.. అప్రమత్తమైన అధికారులు..!
హైదరాబాద్ తో పాటు తెలంగాణలో వర్షాకాలం సీజన్, సీజన్ ముగిసిన తర్వాత దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వస్తాయి. తాజాగా హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు పెరుగుతోన్నాయి. ఈ సీజన్ లో హైదరాబాద్ లో ఇప్పటి వరకు అధికారికంగా 2,31 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. అనధికారంగా కూడా కొన్ని కేసులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 9,254 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
డెంగ్యూతో పాటు మలేరియా, చికెన్ గున్యా కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఈ జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 379 చికున్‌గున్యా కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ పేర్కొంది. ఈ వ్యాధులు పెరగడానకి
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, నీటి ఎద్దడి, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరగడం వంటి కారణంగా చెబుతున్నారు. వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు.

గత సంవత్సరంలో తెలంగాణలో 8,016 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ ఆరంభం నాటికి ఇప్పటికే ఆ సంఖ్య దాటిపోయింది. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు, నిలిచిపోయిన నీటి వనరులను తొలగించడం, పరిశుభ్రత పాటించడం వంటి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
కాగా ఈ నెలలో హైదరాబాద్‌లో డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 2023 లో హైదరాబాద్ లో 554 డెంగ్యూ కేసులు నమోదు అయినట్లు వివరించారు. ప్రస్తుతానికి డెంగ్యూ తగ్గుముఖం పట్టిందని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు చెప్పారు. డెంగ్యూ వస్తున్న 100 మందిలో 10 మందికి మాత్రమే అడ్మిషన్ అవసరమని అవుతుందని అన్నారు. అడ్మిట్ అయిన వారికి ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయన్నారు.
మరియు అత్యవసర కారణంగా అడ్మిట్ చేయబడతాయి. ఆసుపత్రి ఔట్ పేషెంట్ బ్లాక్‌కు రోజుకు 500 మంది రోగులు వస్తుంటారు. వీటిలో దాదాపు 80-90 జ్వరం కేసులు; వీరిలో 5-10 మంది డెంగ్యూ లేదా ఇతర సీజనల్ వ్యాధుల విషయంలో అత్యవసర కారణంగా అడ్మిషన్ అవసరం.












Click it and Unblock the Notifications