ఇందిరమ్మ ఇళ్ళ పథకంపై డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన సూపర్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల సొంతింటి కల నిజం చేయడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారి సొంతింటి కోరిక తీరుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు పైన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక విషయాలను తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త
రామగుండం పర్యటనలో భాగంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి విక్రమార్క ఈ సమయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నవారు డబ్బుల కోసం నిరీక్షించవలసిన అవసరం లేదని, నిర్మాణ దశలవారీగా నిధులను నేరుగా వారి ఖాతాలలోకి విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

వేగంగా పూర్తి చేస్తే నిధులు అంతే వేగంగా విడుదల
పేదలందరికీ సొంతింటి సౌకర్యం కల్పించడమే మన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని భట్టి విక్రమార్క అన్నారు. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన ఇంటి నిర్మాణం ఎంత వేగంగా పూర్తి చేస్తే నిధులు అంతే వేగంగా విడుదల చేయబడతాయి అని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలు
లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఎటువంటి జాతీయం జరగడంలేదని ప్రతివారం నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు జారీలో జాప్యాన్ని పూర్తిగా నివారించాలని అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించారు. దీనికోసం ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని భట్టి విక్రమార్క అన్నారు.
రామగుండం అభివృద్ధిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
అంతేకాదు రామగుండంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన రామగుండం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. గృహ నిర్మాణంతో పాటు, పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం అభివృద్ధి పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రామగుండంలో 800 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. సింగరేణిని పరిరక్షించుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఒక కోటి రూపాయల ప్రమాద భీమాను అందిస్తుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications