ICICI: రూ.8.5 కోట్ల ఖాతాదారుల సొమ్మును కాజేసిన బ్యాంకు డిప్యూటీ మేనేజర్.. ఆ డబ్బుతో బెట్టింగ్..

కొందరు బ్యాంకు ఉద్యోగులు అక్రమమార్గం పట్టి ఖాతాదారుల సొమ్మును కాజేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో సంబంధం లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఏకంగా రూ.8.5 కోట్ల ఖాతాదారుల సొమ్ము కాజేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. నర్సంపేట, వెలుగు, వరంగల్ ​జిల్లాలో కస్టమర్ల డబ్బుతో ఆన్​లైన్ గేమ్స్​ఆడిన ఐసీఐసీఐ బ్యాంక్​ డిప్యూటీ మేనేజర్ ​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్ లో కరీమాబాద్ ​కు చెందిన బైరిశెట్టి కార్తీక్ 2019 నుంచి నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ ​గా విధులు నిర్వహిస్తోన్నాడు. అప్పటి నుంచి గోల్డ్​ లోన్లు, రిన్యూవెల్, క్లోజింగ్ ట్రాన్సక్షన్స్ చూస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాలుగా ఎనిమిది కోట్లు 50 లక్షల రూపాయల ఖాతాదారుల జబ్బును బినామీ ఖాతాల్లోకి మళ్లించాడు. ఆ డబ్బుతో క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ ఆడాడు. బ్యాంకు నగదు నిల్వల్లో తేడా రావడంతో కార్తీక్ ను మేనేజర్ నిలదీశాడు. సరైన సమాధానం చెప్పకపోవడంతో మేనేజర్ పోలీసులు ఫిర్యాదు చేశాడు.

deputy manager of ICICI Bank in Warangal, diverted clients money into his benami accounts

కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ ను నర్సంపేట బస్టాండ్ లో అదుపులోకి తీసుకున్నారు. అతను 128 ఖాతాదారుల నుంచి గోల్డ్ పైసలను దారి మళ్లించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఆడిట్ సమయంలో కస్టోడియన్, ఆడిటర్ల సంతకాలు కూడా కార్తీక్ ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. అతను రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల నుంచి అతను ఇలా చేస్తున్నా.. బ్యాంకు పై అధికారులు గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. గత నెలలో అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ ఖాతాదారుల సంబంధించిన కోటి రూపాయలను కాజేశాడు.

రాయదుర్గంలోని కణేకల్లు రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ సీనియర్‌ మేనేజర్‌గా ఎస్‌ఎల్‌ఎన్‌ ఫణికుమార్‌ విధులు నిర్వర్తించాడు. ఫణికుమార్ జూన్ నెలలో కొందరి ఖాతాదారుల అకౌంట్ నుంచి తన బంధువులు ఖాతాలకు రూ.కోటి 7 లక్షలను బదిలీ చేసుకున్నాడు. బ్యాంకులోని ఇతర సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫణికుమార్ బంధువుల ఖాతా సీజ్ చేసి డబ్బును తిరిగి తీసుకున్నారు. ఆ తర్వాత రీజనల్ మేనేజర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫణికుమార్ గతేడాది కూడా రూ.20 లక్షలను తమ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+