మానస సరోవరంకు వెళ్లిన తెలుగు యాత్రికుల అష్టకష్టాలు
హైదరాబాద్: పదిహేను రోజుల క్రితం మానస సరోవరం వెళ్లిన తెలుగు యాత్రీకులు చైనా - నేపాల్ హిల్సా ప్రాంతంలో తీవ్ర నరకయాతన పడుతున్నారు. వీరు నేపాల్ టూరిజం ద్వారా మానస సరోవరం యాత్రకు వెళ్లారు. కానీ వాతావరణం అనుకూలించడం లేదని నేపాల్ టూరిజం సంస్థ దాట వేస్తోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి 55 మంది తెలుగు వారు వెళ్లారు. నాలుగు రోజులుగా వారు హిల్సా ప్రాంతంలోనే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఒక చిన్న గదిలో ఆరేడుగురిని ఉంచింది నేపాల్ టూరిజం సంస్థ. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హిల్సాలో పరిస్థితులను తట్టుకోలేక గుజరాత్‌కు చెందిన ఓ యాత్రీకుడు మృతి చెందారు. అతనిని తిరిగి తీసుకు వెళ్లి, దహనం చేయాలంటే రూ.18 లక్షలు ఆ సంస్థ అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో చనిపోయిన గుజరాత్ యాత్రీకుడి భర్త అతనిని హిల్సా ప్రాంతంలోనే దహనం చేసింది.

హిల్సా ప్రాంతం చైనా - నేపాల్ సరిహద్దులో ఉంది. వారిని ఉంచిన చిన్న గదిలో వసతి సౌకర్యాలు కూడా సరిగా లేవు. సరైన ఆహారం పెట్టడం లేదు. మౌలిక సదుపాయాలు లేవు. వెళ్లిన 55 మంది తెలుగు వారిలో 13 మంది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు.
విశాఖలో బాలుడు నవదీప్ కథ సుఖాంతం
విశాఖలో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడు నవదీప్ కథ సుఖాంతమైంది. శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ సమీపంలో రోడ్డుపై 11 నెలల బాలుడు ఉండటాన్ని గమనించిన ఉద్యోగులు విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బాలుడ్ని తీసుకెళ్లి నవదీప్ తల్లిదండ్రులను పిలిపించగా. తమ బాలుడేనని చెప్పారు. వారికి అప్పగించారు.












Click it and Unblock the Notifications