పార్టీ చరిత్ర చూడండి, వారిని నమ్మొద్దు: మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ సుడిగాలి ప్రచారం

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని సూచించారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. శుక్రవారం ఆర్మూర్, ముథోల్, కోరుట్లలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్మూర్ సభలో మాట్లాడుతూ.. నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో స‌మానం.. బ‌హుషా ఈ ప్ర‌పంచంలో అంకాపూర్ గురించి నేను చేసినంత ప్ర‌చారం ఎవ‌రూ చేయ‌లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఎన్నిక‌లు వ‌స్తాయి పోతాయి.. పార్టీకి ఒక‌రు నిల‌బ‌డుతారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బ‌రిలో ఉంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. మీ అంద‌ర్నీ ప్రార్థించేది ఒక్క‌టే. ఇక్క‌డ రైతాంగం అధికంగా ఉంట‌ది. పంట‌లు బ్ర‌హ్మాండంగా పండిస్తారు. నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో స‌మానం. బ‌హుషా అంకాపూర్ గురించి నేను చేసినంత ప్ర‌చారం ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ చేయ‌లేదు. అంత‌మంచి అభ్యుద‌య‌మైన రైతులు. అంకాపూర్ రైతుల చైత‌న్యంతో, వారిని స్ఫూర్తిగా తీసుకొని వంద‌లాది గ్రామాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు.

Dont believe congress and BJP: KCR in public meetings held in korutla, muthole, armoor

ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. జీవ‌న్ రెడ్డి ఏదైనా కావాలంటే ప‌ట్టుద‌ల‌తో సాధిస్తడు. అందుకే న‌మ్ముకున్న ప్ర‌జ‌ల కోసం ప‌నులు చేయిస్త‌డు. అందుకే మీ అభిమానం ఇవాళ క‌న‌బ‌డుతుందని కేసీఆర్ అన్నారు. ఇది ఆర్మూరు జ‌న‌మా.. ప్ర‌భంజ‌న‌మా.. అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఆర్మూర్‌లో ఒక విష‌యం అయితే తేలిపోయింది. ఈ స‌భ స‌ముద్రాన్ని చూసిన త‌ర్వాత జీన‌వ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచిపోతార‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది. జీవ‌న్ రెడ్డి ప్ర‌త్యేక‌త ఏంటంటే.. తెలంగాణ ఉద్య‌మంలో ఉండి.. ఎర్ర జొన్న రైతుల‌కు కోసం ఆర‌మ‌ణ దీక్ష చేశారు. ఫైరింగ్ జ‌రిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోలీసు కాల్పులు జ‌రిపింది. నేను ఎక్క‌డ్నో క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాను. ఇక్క‌డ కాల్పులు జ‌రిగాయిని తెలిస్తే హుటాహుటిన ఆర్మూర్‌కు వ‌చ్చాను. అప్ప‌ట్నుంచి నాకు స‌న్నిహితుడై కుటుంబంలో ఓ స‌భ్యుడిగ‌లా ఉండి, పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు జీవ‌న్ రెడ్డి అని తెలిపారు. ఇతర పార్టీల చెప్పేవన్నీ న‌మ్మ‌కండి. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే వ్య‌క్తి.. త‌న నియోజ‌క‌వ‌ర్గం కోసం పాటు ప‌డే వ్య‌క్తి జీవ‌న్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని కోరుతూ కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

పార్టీ చరిత్ర ఆలోచించి ఓటేయండి
మరోవైపు, ముథోల్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల్లో విచ‌క్ష‌ణ జ్ఞానంతో ఓటు వేయాలి.. లేదంటే ఐదేండ్లు బాధ‌ప‌డాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. స‌రైన పార్టీకి ఓటు వేస్తేనే స‌రైన భ‌విష్య‌త్ ఉంటుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ త‌ర‌పున విఠ‌ల్ రెడ్డి ఉన్నారు. వేరే పార్టీలో కూడా ఎవ‌రో ఒక‌రు ఉంటారు. 30న ఓట్లు వేస్త‌రు. 3న లెక్క అయిపోతాయి. ఎవ‌రో ఒక‌రు గెలుస్త‌రు. అది త‌ప్ప‌దు అని కేసీఆర్ అన్నారు.

కానీ మీ బిడ్డ‌గా తెలంగాణ తెచ్చిన నాయ‌కుడిగా, బాధ్య‌త ఉంది కాబ‌ట్టి చెబుతున్నా.. ఎందంటే.. ఎన్నిక‌ల్లో ఒక వ్య‌క్తి నిల‌బ‌డుతాడు. మంచి, చెడు, అత‌ని గుణ‌గ‌ణాలు ఆలోచించాలన్నారు కేసీఆర్.

అంతే కాకుండా ఆ వ్య‌క్తి వెనుకాల ఏ పార్టీ ఉంది. పార్టీకి చ‌రిత్ర ఉంటుంది. ఆ చ‌రిత్ర ఏందో మీకు తెలుసు. ప్ర‌జ‌లు, రైతుల గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించాలి. ఇవ‌న్నీ మీరు విచారించి ఓటు వేయాలి. అలాంట‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతంది. విచ‌క్ష‌ణ జ్ఞానంతో ఓటు వేయాలి. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల వ‌ద్ద ఉంటే వ‌జ్రాయుధం ఓటు. స‌రైన పార్టీకి ఓటేస్తేనే భ‌విష్య‌త్ స‌రైన ప‌ద్ధ‌తిలో ఉంటుంది. లేదంటే వ‌చ్చే ఐదేండ్లు బాధ‌ప‌డాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ర‌జ‌లంద‌రూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి ఓటు వేయాలి అని కేసీఆర్ కోరారు.

ఆ పార్టీల మాటలు నమ్మకండి
కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకుల మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. కోరుట్ల సభలో ఆయన మాట్లాడుతూ.. .. 'దేశంలో పరిశ్రమలు, వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మళ్లీ మరోపార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ అంధకారంలోకి వెళుతుందని హెచ్చరించారు. రైతులు, ప్రజల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

రెండు సార్లు రుణమాఫీ చేశామని కేసీఆర్ తెలిపారు. రైతుల భూములు ఆక్రమణలకు గురికాకుండా ధరణి తీసుకొచ్చినమని చెప్పారు. ధరణి వల్లనే రైతుబంధు వస్తున్నది. రైతు బీమా వస్తున్నది. ధరణి తీసేస్తే రైతుబంధు ఇవ్వడం సాధ్యం కాదు. రైతు బీమా ఇవ్వడం కుదరదు. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేస్తం అంటున్నరు. ధరణిని కాదు, కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి' అని సీఎం అన్నారు. రాష్ట్రంలో బీడీ కార్మికులను ఆదుకుంటామని చెప్పారు.

కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తం. కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మవద్దు. నమ్మి మోసపోవద్దు. సంజయ్‌ మంచి వైద్యుడు. ఆయన తలుచుకుంటే వృత్తి ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ నేను నా గడ్డకు సేవ చేసుకుంటా అనే సంకల్పంతో పోటీకి సిద్ధమైండు. నేను నిరాహార దీక్ష చేసిన సమయంలో డాక్టర్‌ సంజయ్‌ నన్ను దగ్గురుండి చూసుకున్నడు. నా ప్రాణాలు కాపాడిండు. డాక్టర్‌ సంజయ్‌ నాకు బిడ్డ లాంటి వాడు అని కేసీఆర్ పేర్కొన్నారు. డాక్టర్‌ సంజయ్‌ స్థానిక బిడ్డ. ఆయనను మీరంతా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలి' అని సీఎం కేసీఆర్‌ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+