అనవసరంగా కోర్టుకెక్కారా: పూరీని ఎందుకు లాగారు, చార్మి తొందరపడ్డారా?
డ్రగ్ కేసులో విచారణ కోసం హాజరయ్యే విషయంలో హైకోర్టుకు వెళ్లి సినీ నటి చార్మి తొందర పడ్డారా?అంటే అవుననే అంటున్నారు. హైకోర్టులో ఆమెకు పెద్దగా ఊరట లభించిందమీ లేదు.
హైదరాబాద్: డ్రగ్ కేసులో విచారణ కోసం హాజరయ్యే విషయంలో హైకోర్టుకు వెళ్లి సినీ నటి చార్మి తొందర పడ్డారా? అంటే అవుననే అంటున్నారు. హైకోర్టులో ఆమెకు పెద్దగా ఊరట లభించిందమీ లేదు.
చార్మి విచారణ గడువు రోజు (బుధవారం) పూర్తికాకుంటే మరో రోజు పిలవాలని సిట్‌కు సూచించింది. సిట్ విచారణలో తనతో పాటు లాయర్‌ను అనుమతించాలన్న ఛార్మి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

అసలు హైకోర్టుకు ఎందుకు వెళ్లారనేది ప్రశ్న?
చార్మి అసలు హైకోర్టుకు ఎందుకు వెళ్లారనేది ప్రశ్నే అని చాలామంది అంటున్నారు. ఈ విషయంలో హైకోర్టు తీర్పు తర్వాత ఎక్సైజ్ శాఖ స్పందించింది. చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్లారని అభిప్రాయపడ్డారు. చార్మిని తాము నిందితురాలు అనలేదని, వివరణ కోరినట్లు చెప్పారు.

అనవసరంగా వెళ్లారనేందుకు ఇవీ కారణాలు అంటున్నారు
పూరీ జగన్నాథ్, తరుణ్, నవదీప్‌లను సుదీర్ఘంగా విచారించారు. వారి ఓకే అని చెప్పాకనే రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు విచారించినట్లు సిట్ స్పష్టం చేసింది. చార్మీ మహిళ కాబట్టి సుదీర్ఘ విచారణకు అవకాశం లేదు. తొలుత అధికారులో ఆమెను రాత్రి వరకు విచారించరు. విచారణలో ఇబ్బంది పెట్టే అంశాలు ఉండవు. ఎందుకంటే విచారణను మొత్తం వీడియో తీస్తున్నట్లు అధిరులు స్పష్టం చేశారు. అధికారులు హద్దు మీరితే వీడియోలో స్పష్టంగా ఉంటుంది.

బలవంతపు సేకరణపై
బలవంతంగా రక్త నమూనాలు సేకరిస్తున్నారనేది చార్మి ప్రధాన ఆరోపణ. కానీ దీని పైనా అధికారులు స్పష్టత ఇచ్చారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు ప్రతి ఒక్కరి నుంచి తాము శాంపిల్స్ సేకరించలేదని చెప్పారు. పూరీ జగన్నాథ్, తరుణ్‌ల నుంచి మాత్రమే శాంపిల్స్ తీసుకున్నట్లు చెప్పారు. నటుడు నవదీప్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తే తీసుకోలేదు. దానిని డైరీలో రాశారు. అలాగే, చార్మీ ఇవ్వనని చెప్పినా తాము బలవంతంగా తీసుకోమని అంటున్నారు.

పూరీ జగన్నాథ్‌ను ఎందుకు లాగారు?
పూరీ జగన్నాథ్ నుంచి బలవంతంగా శాంపిల్స్ సేకరించినట్లు చార్మీ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, పూరీ అనుమతితోనే తాము తీసుకున్నట్లు సిట్ అధికారులు చెప్పారు. పూరీ కూడా సోషల్ మీడియాలో సిట్ అధికారులపై అభాండాలు వేయలేదు. కానీ తనకు డ్రగ్స్ అలవాటు లేదని మాత్రం చెప్పారు. పూరీతో చార్మికి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దీంతో ఆయన ఆమెకు వ్యక్తిగతంగా చెప్పారా అనే చర్చ సాగుతోంది.

దర్యాఫ్తు బృందంలో మహిళా అధికారి
దర్యాఫ్తు బృందంలో మహిళా అధికారులు ఉండాలని చార్మీ పేర్కొన్నారు. విచారణ బృందంలో మహిళా అధికారి విజయలక్ష్మి ఉన్నట్లు అధికారులు ముందుగానే చెప్పారు. ఆమెకు కొంత ఊరటనిచ్చేలా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. న్యాయస్థానం చెప్పకపోయినా వాటిని అధికారులు ఫాలో అవుతారని అంటున్నారు. మహిళ కాబట్టి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ, విచారణ బృందంలో మహిళా అధికారి ఉండటం.. వీటిని సిట్ అధికారులు కూడా ఫాలో అయ్యే వారని అంటున్నారు. పైగా తన వెంట లాయర్ ఉండాలన్న చార్మి వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

డ్రగ్స్ కేసులో షాకింగ్
డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో సినీ తారలు అలో వీరా జ్యూస్ తాగి వస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. డ్రగ్ తీసుకున్నట్లుగా తెలియకుండా ఉండేందుకు అలా చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, డ్రగ్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications