Manuguru: మణుగూరులో జల విలయం.. నీట మునిగిన పలు ప్రాంతాలు..!

తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరుపు లేకుండా పవడుతున్న వానలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వదర నీరు ఇళ్లను చుట్టూ ముట్టాయి. ఆదివారం రాత్రి కురిసి భారీ వర్షంతో మణుగూరులో కనీవిని ఎరుగని రీతిలో జలప్రళయం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పోలీస్, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

మణుగూరు పట్టణ ప్రధాన రహదారి పై పెట్రోల్ బంక్ ఏరియా చెరువు లాగా మారింది. కట్టవాగు, కోడిపుంజుల వాగు ప్రమాదకర స్థితిలో ప్రవాహిస్తోంది. దీంతో మెయిన్ రోడ్ పైనే భారీ నీరు చేరింది. దీంతో ప్రజలు ఎటు వెళ్లలేకపోతున్నారు. అధికారులు పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న ఇద్దరు గర్భిణీలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రధాన రహదారి వేణు రెస్టారెంట్ వద్ద వరద భారీగా చేరింది. మోకాలు కంటే ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉంది.

Due to heavy rains flood water reached many parts of Manuguru

దీంతో ఆ దారిలో పోలీసులు రాకపోకలను బంద్ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రజలను పంపుతున్నారు. బాలాజీ నగర్, కుంకుడు కాయల చెట్ల గుంపు, గాంధీనగర్, కాళీమాత ఏరియా ఆదర్శనగర్, సుందరయ్య నగర్, ఆదర్శనగర్, వినాయక నగర్, చేపల మార్కెట్ ప్రాంతం నీటిలో మునిగిపోయాయి. వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వైద్య, మున్సిపల్, పోలీసులు అందురూ విధుల్లో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీఎస్ శాంతి కుమారితో మాట్లాడారు. జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఎదుర్కునేలా అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు విధుల్లో ఉండాలని.. ముఖ్యంగా రెవెన్యూ, ఆరోగ్యో, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+