నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు: ఢిల్లీకి పయనం
హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ( నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌కు, పార్టీ అనుబంధ సంస్థలకు విరాళమిచ్చిన కొందరు నేతలకు నోటీసులు ఇచ్చింది. కాగా, ఈడీ నోటీసులు అందుకున్న వారిని కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి రావాలని సూచించింది.
ఈ క్రమంలో గురువారమే.. కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, ఆడిటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీని విచారించింది.

ఈ కేసులో భాగంగా విరాళమిచ్చిన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో.. కేసు పూర్వాపరాల గురించి కాంగ్రెస్ అధిష్ఠానం నోటీసులు అందుకున్న వారికి వివరాలు తెలియచేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈడీ నోటీసులు అందుకున్న షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్‌కుమార్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఈడీ తెలంగాణ కాంగ్రెస్, ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వివిధ కేసుల్లో నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications