ఢిల్లీకి కవిత తరలింపు: విమానాశ్రయం వద్ద లాఠీఛార్జ్

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. శుక్రవారం రాత్రి ఆమెను ప్రత్యేక వాహనంలో శంషాబాద్ ఎయిర్‌‍పోర్టుకు తరలించారు. విమానాశ్రయం వద్ద కవిత అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై స్వల్ప లాఠీఛార్జీ చేశారు పోలీసులు. భారీ మొత్తంలో విమానాశ్రయంలో పోలీసులను మోహరించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులకు కవిత అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాగా, ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాత్రి 8.45 గంటలకు కవితను ఢిల్లీకి విమానంలో తీసుకెళ్లారు. నేరుగా ఆమెను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ రాత్రి ఈడీ కార్యాలయంలోనే కవిత బస చేయనున్నట్లు తెలిసింది. శనివారం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించానున్నారు. ఆ తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్నారు.

ED officials took Kavitha to delhi from hyderabad airport in delhi liquor case

కాగా, అంతకుముందు, శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌‌లోని కవిత నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు ఐదు గంటలపాటు నిర్వహించిన సోదాల అనంతరం కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. అయితే, కవిత అరెస్టుపై ఆమెతోపాటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈడీ అధికారులను ప్రశ్నించారు. కాసేపు వీరి మధ్య వాగ్వాదం జరిగింది.


అయితే, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు కవితకు ఇచ్చిన మెమోలో పేర్కొన్నారు. పీఎంఎల్ఏ చట్టం కింద శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టుకు గల కారణానలు వివరిస్తూ 14 పేజీల మెమో ఇచ్చారు. కవితతోపాటు ఆమె భర్త అనిల్ కు కూడా సమాచారం ఇచ్చామని, మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 3 కింద కవిత నేరానికి పాల్పడ్డారని ఈడీ తెలిపింది.


శంషాబాద్ విమానాశ్రయానికి తరలిస్తుండగా.. కవిత బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. విక్టరీ సింబల్ చూపించారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా పోరాడుతామని చెప్పారు. పార్టీ శ్రేణులు బలంగా మనోధైర్యంగా ఉండాలన్నారు. కక్ష సాధింపు చర్యలను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. కాగా, ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో శనివారం బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+