నౌహీరా షేక్ ‘హీరా’ గ్రూప్ సంస్థలపై ఈడీ దాడులు: భారీగా ఆస్తుల గుర్తింపు
హైదరాబాద్: భారీ రాబడి, డిపాజిట్ల పేరుతో వందల కోట్లు సేకరించిన హీరా గ్రూప్ సంస్థలపై శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మరోసారి దాడులు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని హీరా గ్రూప్ ఛైర్మన్ నౌహీరా షేక్ ఆఫీసు, ఎమ్మెల్యే కాలనీలోని నివాసాల్లో, టోలీకౌకితోపాటు 10 చోట్ల ఈడీ సోదాలు చేసింది. శనివారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు కొనసాగాయి.
బంజారాహిల్స్ లోని హీరా గ్రూప్ కంపెనీస్ డైరెక్టర్ నౌహీరాషేక్ ఆఫీస్, ఇళ్లతో పాటు సంస్థ డైరెక్టర్లు, సీఈవోల ఇళ్ల్లోనూ ఈ సోదాలు జరిగాయి. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ సోదాల్లో భారీగా నగదు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

టోలీచౌకిలోని ఎంఎస్సీ కాలనీలో మొత్తం 80 కోట్ల విలువైన 81 ప్లాట్లు సీజ్ చేశారు. ఇప్పటి వరకు 380 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. అంతేగాక, రూ. 600 కోట్లకుపైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేయనున్నట్లు సమచారం.
నౌహీరా షేక్ పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి భారీగా ఆస్తులు సేకరించి భారీగా ఆస్తులు కూడా పెట్టుకున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు, నౌహీరా షేక్ పై గతంలోనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నౌషీరా షేక్ పై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications