తెలంగాణలో పోలింగ్ సమయం పెంచిన ఈసీ: కారణం ఇదే

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే 13 జరిగే పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

రాజకీయ పార్టీల వినతి, వడగాలులు, ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయం పెంచినట్లు ఈసీ వెల్లడించింది. ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Election commission extended polling time in telangana state

పోలింగ్ ఏర్పాట్లలో ఎన్నికల సంఘం

తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ల దరఖాస్తులను పరిశీలించి 525 మంది అభ్యర్థులు లోక్‌​సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్​ రాజ్​ తెలిపారు. హైదరాబాద్‌​లోని ఎన్నికల భవన్‌​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అత్యధికంగా సికింద్రాబాద్​ లోక్​‌సభ నియోజకవర్గంలో 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్‌​లో అత్యల్పంగా 12 మంది పోటీలో ఉన్నారన్నారు. అలాగే 285 మంది స్వతంత్రులు లోక్​‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వికాస్ రాజ్ వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌​సభ నియోజకవర్గాల్లో ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు ఈసీ వికాస్​ రాజ్​ తెలిపారు. ఆదిలాబాద్​ లోక్‌​సభ స్థానంలో ఒక్క ఈవీఎం మాత్రమే సరిపోతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనంగా కొన్ని ఈవీఎంలు రప్పిస్తున్నామని తెలిపారు. పోస్టల్​ బ్యాలెట్‌​ను జిల్లాల్లో ప్రింట్​ చేస్తున్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ ​రాజ్​ చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్​ రాజ్​ తెలిపారు. హైదరాబాద్​‌లో 3,986 పోలింగ్​ బూత్​‌లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయన్నారు. 2.94 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నామని, పోలింగ్​ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ఈసీ వికాస్​ రాజ్​ వివరించారు.

మరోవైపు, ఎన్నికల ఫిర్యాదులకు టోల్​ ఫ్రీ నంబరు 1950 ఏర్పాటు చేశామని వికాస్ రాజ్ తెలిపారు. టోల్​ ఫ్రీ నంబరు ద్వారా ఇప్పటివరకు 1,227 ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్​ స్టేషన్లు ఉన్నాయని, 15 వేల మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+