ఎంక్వైరీ టైమ్.. నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్ !
కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. సంచలనంగా మారిన ఈ ఇష్యూలో విచారణ కోసం ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ ప్రారంభించిన కమిషన్ పలువురు అధికారులను సైతం విచారించింది. షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ముగియగా.. ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఈ క్రమంలోనే సమగ్ర దర్యాప్తు కోసం ఇవాళ్టి నుంచి బహిరంగ విచారణ మరోమారు జరగనుంది.
జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ఈ కమిషన్ ఇప్పటికే అనేక అధికారుల నుంచి వాంగ్మూలాలు తీసుకుంది. కానీ ఇప్పటి వరకు ఈ విచారణ పరిపాలనా, టెక్నికల్ అధికారుల పరిధిలోనే సాగింది. ఇప్పుడు ఈ విచారణ రాజకీయ నేతల వైపు మళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు విచారణకు హాజరవుతుండం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈటల కీలక పాత్ర పోషించారు. దీంతో ప్రాజెక్టు వ్యయాలు, నిధుల విడుదల, మంత్రివర్గ తీర్మానాల విషయాల్లో ఆయన నుంచి కమిషన్ వివరణ తీసుకోనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా బ్యారేజీలకు నిధుల విడుదల, మంత్రివర్గ ఆమోదాలు, ఫైనాన్షియల్ క్లియరెన్సులు, ప్రాజెక్టు వ్యయాల్లో ఊహించని మార్పులు వంటి అంశాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
నోరు విప్పుతారా..?
అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఈటల.. ఇప్పుడు బీజేపీ లోకి మారడంతో విచారణలో ఏం చెబుతారో అని చర్చ జరుగుతోంది. అంతే కాకుండా విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావులకు సైతం నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ విచారణ జూన్ 5న జరగాల్సి ఉండగా, ఆయన అభ్యర్థన మేరకు జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది కమిషన్. హరీష్ రావు జూన్ 9న కమిషన్ ముందు హాజరుకానున్నారు.
ఈ విచారణలో ప్రధానంగా లైట్ హౌస్, అన్‌అప్రూవ్డ్ ఎస్టిమేట్స్, రెవిజన్లు, మేఘా సంస్థకు భారీ కాంట్రాక్టులు కట్టబెట్టడం, టెండర్ల ప్రాసెస్ లో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇప్పటికే కొన్ని ఫైళ్లను మంత్రివర్గ ఆమోదం లేకుండా జరిపారని గతంలో పలువురు అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు ఆ అంశాలపై ఈటలను ప్రత్యక్షంగా ప్రశ్నించే అవకాశం ఉంది.
హై సెక్యూరిటీ..
హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో, కమిషన్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. నగర పోలీసులకు నీటిపారుదలశాఖ, కమిషన్ వర్గాల నుంచి అధికారికంగా లేఖలు పంపించి భద్రత ఏర్పాటు చేయించారు. మీడియా, కార్యకర్తల రాకపోకల నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మొదట్లో రూ. 38,500 కోట్లు ఖర్చు అవుతుందనే అంచనా వేయగా.. తరువాత అది రూ. 1,15,000 కోట్లకు పెరగడం, నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడం, గెజిట్ ఆమోదం లేకుండా పనులు ప్రారంభించడంపై ప్రజల్లో అనుమానాలు చెలరేగాయి. ఈ అంశాలపై ఇప్పటికే విచారణలో పలు కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఇప్పుడు నేతల విచారణ ద్వారా ఇంకా లోతైన విషయాలు వెలుగులోకి రానున్నాయని భావిస్తున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications