మద్యం దుకాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, మహిళల ఎంట్రీతో..!!
మద్యం దుకాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం ఎక్సైజ్ శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. ఇదే సమయంలో ఊహించని విధంగా ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి మహిళలకు మద్యం దుకాణాల టెండర్లు దాఖలు చేసారు. దీంతో... మరింత స్పందన వస్తుందనే అంచనాలతో ఎక్సైజ్ శాఖ టెండర్ల గడువు తేదీ పొడిగించింది. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన చేసింది.
మద్యం దుకాణాల టెండర్ల పైన ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో.. మద్యం షాపుల టెండర్ల గడువు అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ నెల 23వ తేదీన జరగాల్సిన మద్యం షాపుల డ్రాను సైతం వాయిదా వేశారు.

శనివారం బంద్ కారణంగా బ్యాంకులు తెరుచుకోలేదు. దీంతో మద్యం దరఖాస్తులపై బంద్ ప్రభావం చూపిందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది భారీగా ఈ దరఖాస్తులు తగ్గినట్లు సమాచారం. ఇదే సమయంలో టెండర్ల విషయంలో పలు ఆసక్తి కర అంశాలు వెలుగు లోకి వచ్చాయి.
శనివారంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టెండర్ల గడువు ముగియాల్సి ఉంది. కాగా, చివరి నిమిషంలో ఈ దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు శనివారం భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ ఒక్క రోజే 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 90 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక, ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో 150 మద్యం దుకాణాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడం ఆసక్తిగా మారుతోంది. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి టెండర్లు దాఖలు చేసారు. అందులో మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటంతో.. ఇప్పుడు టెండర్ల ఖరారు.. మద్యం దుకాణాల నిర్వహణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications