మగపిల్లలు లేరని కూతుర్ని చంపిన తండ్రి: నోట్లో యాసిడ్ పోసి చోరీ

Murder

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా పటాన్‌చెరు గౌతమ్‌నగర్‌లో దారుణ సంఘటన జరిగింది. మగపిల్లలు లేరన్న కారణంగా రెండేళ్ల చిన్నారిని కన్నతండ్రి ధన్‌రాజ్ కొట్టి చంపాడు. ఈ అమానుషమైన ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ధన్‌రాజ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఇదిలావుంటే, నోట్లో యాసిడ్ పోసి దొంగతనం చేసిన ఘటన సికింద్రాబాదులోని నేరేడ్‌మెట్టులో జరిగింది. శుక్రావంర మధ్యాహ్నం నేరెడ్‌మెట్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నేరెడ్‌మెట్ పరిధిలోని శ్రీసాయి బాలాజీ జ్యువెల్లర్స్ దుకాణంలోకి శుక్రవారంనాడు మధ్యాహ్నం దోపిడీ దొంగలు ప్రవేశించారు.

దుకాణం యజమాని మోహన్ నోట్లో యాసిడ్ పోసి బంగారం నగలను అపహరించారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోహన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

రంగారెడ్డి జిల్లాలోని పాత తాండూరు నిజాంషాహీ బావిలో పడి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బావిలోని నీరును పూర్తిగా తోడి బాలుడు మృతదేహాన్ని బయటకు తీశారు స్థానికులు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+