హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం (వీడియో)

Recommended Video

    హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం

    హైదరాబాద్: హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో స్వల్ప అగ్ని ప్రమాగం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం సాయంత్రం స్టేషన్లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి.

    దీంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. మరోవైపు వెల్డింగ్ పనులు చేస్తున్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

    మరోవైపు, ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ఆడిట్ విభాగంలో ఉదయం ఏడు గంటలకు మంటలు చెలరేగి సామాగ్రి అంతా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కంప్యూటర్, ముఖ్యమైన దస్తావేజులు, ఫర్నిచర్ ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.

    సకాలంలో రెండు ఫైరింజన్లు చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేశాయి. సుమారు గంటసేపు ప్రయత్నించి అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ సంఘటన ఎలా జరిగింది అనే దానిపై విచారణ చేపట్టారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+