షాకింగ్: చేపల కోసం వల వేస్తే భారీ కొండ చిలువ పడింది, ఆందోళన
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో చేపల కోసం వేసిన వలలో ఓ కొండ చిలువ పడింది. ఈ సంఘటన బుధవారం నాడు కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. చేపల వేటకోసం వేసిన వలలో ఎనిమిది అడుగుల పొడవు ఉన్న కొండచిలువ చిక్కింది.
నాయకన్ గూడెం గ్రామానికి చెందిన షేక్ మన్సూర్ పాలేరు జలాశయంలో చేపల వేటకు గానూ ప్రతీరోజు మాదిరిగానే మంగళవారం రాత్రి వల వేసి పెట్టాడు. బుధవారం ఉదయం వెళ్లి వలలో చిక్కిన చేపలకోసం పరిశీలిస్తుండగా వల భారీగా కన్పించింది.

సమీపంలోని తోటి మత్స్యకారులను పిలిచి వలను జలాశయం ఒడ్డుకు లాగడంతో అందులో మృతి చెందిన కొండ చిలువ కనిపించింది. దీంతో జలాశయం ఒడ్డుకు చేర్చాడు. గత అయిదేళ్ల క్రితం ఇదే జలాశయంలో నల్గొండ జిల్లా బోడబండ్లగూడెం గ్రామానికి చెందిన షేక్ సోందుకు కూడా ఇదే విధంగా కొండచిలువ చిక్కింది. జలాశయంలో కొండచిలువ రావడంతో మత్స్యకారుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications