ఆ ఐదుగురికి డబుల్ హ్యాట్రిక్.. ఆరు సార్లు గెలిచిన ప్రజానేతలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారు ప్రజలు. నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలకు ఫిదా అయిపోయారు. గులాబీ రంగుకు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు మరోసారి కారు గుర్తుకు పట్టం కట్టారు. కొన్నిచోట్ల పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ కట్టబెట్టారు. సిద్ధిపేట నుంచి బరిలో నిలిచిన హరీశ్ రావు లక్షకు పైచిలుకు మెజార్టీతో అఖండ విజయం సాధించారు.
టీఆర్ఎస్ భారీ విజయం, గులాబీ సంబరాలు (ఫోటోలు)
అదలావుంటే ఐదుగురు టీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ ఎన్నికల్లో గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ ప్రజాభిమానంతో వరుసగా ఎన్నికవుతూ రావడం విశేషం.














Click it and Unblock the Notifications