బర్రెలక్కకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అండ

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.

తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది.

Former CBI JD VV Lakshminarayana urges to security to Sirisha alias barrelakka

ఈ పరిస్థితుల్లో నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న నిరుద్యోగ యువతి శిరీష అలియాస్ బర్రెలక్క (Sirisha aliast Barrelakka)పై దాడి జరగడం కలకలం రేపింది. బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటింటి ప్రచారం చేస్తోన్న సమయంలో ఆమె తమ్ముడిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో బర్రెలక్క కన్నీటిపర్యంతం అయ్యారు. తనకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని, ఓడిపోతామనే భయంతోనే ప్రత్యర్థులు దాడులు చేయించారని మండిపడ్డారు.

ఈ ఘటనపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. బర్రెలక్కపై జరిగిన దాడిని తప్పుపట్టారు. ఓ యువ అభ్యర్థినిపై దాడికి దిగడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆమెకు శిరీష అలియాస్ బర్రెలక్క, ఆమె సోదరుడిపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని భధ్రత కల్పించాలని అన్నారు. బర్రెలక్క, ఆమె కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+