మాజీ సీఎం కేసీఆర్ కు అస్వస్థత .. ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. కేసీఆర్ కు సాధారణ గ్యాస్ట్రిక్ పరీక్షలు నిర్వహించామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వివరించారు.

మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు నేతలు ఉండనున్నారు. కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేశారు. ఏఐజీ ఆస్పత్రిలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు సాధారణ గ్యాస్ట్రిక్ పరీక్షలు ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ పలుమార్లు ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన విషయం తెలిసిందే.

Former CM KCR Falls Ill Admitted to AIG Hospital in Hyderabad

జూన్ 11న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు అయ్యారు. కమిషన్ సంధించిన 18 ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. దాదాపు గంట పాటు ఆయనను విచారించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. జూన్ 11న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విచారణ ప్రారంభం అయింది. ఆ సమయంలోనే కేసీఆర్ స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్ అంగీకరించింది. సుమారు గంటపాటు ఆయన్ను కమిషన్ ప్రశ్నించింది. 18 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+