సీఎంను కలవలేకపోతున్నానని.. ఐదుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే ఆవేదన!

సీఎం ఇంటి గేటు బయట చొక్కా, పంచతో దీనంగా నుంచొని చూస్తున్న వ్యక్తి.. సాధారణ వ్యక్తి లానే అనిపించవచ్చు. కానీ ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే. సీఎంని ఈరోజు అయిన కలుస్తానా అంటూ ఎదురు చూస్తున్న ఆయన ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ప్రజా సమస్యలను విన్నవించేందుకు సీఎం రేవంత్‌రెడ్డిని కలవాలని నాలుగుసార్లు యత్నించినా ఫలితం లేకపోయిందని వాపోయారు.

తెలిసిన నేతలు, అధికారులకు ఫోన్‌ చేస్తే రమ్మంటున్నారు. సీఎంను కలిసే అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, చెక్‌డ్యాంలు, ఎత్తిపోతల పథకాల సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించాలని ప్రయత్నిస్తున్నా. ఇంటి గేటు వద్దనే నిలువరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రజలు సైతం విమర్శలు చేస్తున్నారు.

former MLA who won five times but unable to meet the CM
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+