ఇద్దరు ఆడపిల్లలతో సహా చెరువులో దూకి దంపతుల ఆత్మహత్య
Recommended Video

Four Of Family End Life By Jumping In Lake
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చెల్ జిల్లా కీసరలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్దమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
కొండాపూర్ గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు ఆడపిల్లలను చెరువులో పడేసి తాము దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమని భావిస్తున్నారు. కొండాపూర్‌లోని తమ ఇంట్లో దంపతులు గొడవ పడ్డారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు.
మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. మరణించినవారిని రమేష్(25), మానస(23), మనశ్రీ(2), గీతశ్రీ( 6నెలలు)గా గుర్తించారు.












Click it and Unblock the Notifications