GHMC: రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూళ్లు, ఖైరతాబాద్ టాప్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2038.48 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,917 కోట్లు వసూలైంది. గత ఏడాదితో పోలిస్తే రూ. 121 కోట్లు అధికంగా వసూలయ్యాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తంగా 14.8 లక్షల ఆస్తులకు సంబంధించి రూ. 2038.48 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఖైరతాబాద్ జోన్‌లో అత్యధికంగా రూ. 530 కోట్లు, చార్మినార్ జోన్‌లో అత్యల్పంగా ఆస్తి పన్ను వసూల్లు రాబట్టినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.

ఎల్ఆర్ఎస్ ద్వారా రూ. 1000 కోట్లు దాటిన ఆదాయం
లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలను అధికారులు తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 15.27 లక్షలు కాగా, వీటిలో తిరస్కరణకు గురైనవి 15,894 ఉన్నాయి.
ప్రాసెస్ అయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు: 6.87 లక్షలు
ఎల్ఆర్ఎస్ ఫీజు పెండింగ్ ఉన్న దరఖాస్తులు: 8.65 లక్షలు
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తులు: 2.6 లక్షలు
ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు: 58,032 ఉన్నాయి.












Click it and Unblock the Notifications