ప్రియుడి మోసం: హస్సేన్‌సాగర్‌లో దూకిన యువతి

హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్‌లో దూకింది.

అయితే, యువతి హుస్సేన్ సాగర్‌లోదూకడాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆమెను కాపాడారు.యువతికి కౌన్సెలింగ్ చేసి సురక్షితంగా ఇంటికి పంపించారు.

కారు బీభత్సం, ఇద్దరి మృతి

హైదరాబాద్‌ మియాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మెదక్‌ జల్లా రామచంద్రాపురానికి చెందిన ఓ కుటుంబం కారులో వెళుతూ ఉండగా మియాపూర్‌ వద్ద టైర్‌ పంక్చర్‌ అయింది.

Girl attempted to commit suicide jumping into Hussain sagar

దీంతో అదుపుతప్పి సమీపంలో ఉన్న హోటల్‌ బోర్డును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా కారులోని మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను పద్మ (50), శ్రీకాంత్ (30)లుగా గుర్తించారు.

బీహెచ్‌ఈఎల్‌ మ్యాక్స్‌ సొసైటీలో నివాసముంటున్న ఓ కుటుంబం రిసెప్షన్‌ కోసం చాంద్రాయణగుట్టకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న వ్యాగనార్‌ కారు దీప్తిశ్రీనగర్‌లోని ఓ హోటల్‌ బోర్డుకు ఢీకొంది. ఈ సంఘటనలో కారు టైరు పగిలింది.

కారులో మంటలు

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఫరూక్‌నగర్‌ మండలం అన్నారం దగ్గర కారులో మంటలు రేగాయి. దీంతో కారు దగ్ధం అయింది. కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+