కెసిఆర్‌కు లేఖ రాసింది: హెయిర్ డై తాగేసి ఆత్మహత్య చేసుకుంది

నల్లగొండ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌లో గణితం సబ్జెక్ట్‌ను తొలగించాలని కోరుతూ ఓ సైన్స్ విద్యార్థి ని ఆత్మహత్యకు పాల్పడింది. తనలాగే చాలా మంది మ్యాథ్స్ వల్ల మథనపడుతున్నారని, ఆ సబ్జెక్ట్‌ను తొలగించి మెంటల్ ఎబిలిటీ ప్రవేశపెట్టాలని సూసైడ్ నోట్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు విన్నవించింది.

నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన కే ప్రమీల బీఈడీ పూర్తిచే సింది. ప్రస్తుతం ఎమ్మెస్సీ చదువుతున్న ఆమె టెట్ కోసం సమాయత్తమవుతున్నది. ఈనెల 7న హెయిర్‌డై తాగింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించింది.

Girl commits suicide opposing maths i TET exam

నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన కాకునూరి ప్రమీల (22) బీఎస్సీ, బీఈడీ (బయోసైన్స్‌) పూర్తిచేసి, ఎంఎస్సీ అభ్యసిస్తోంది. ఇటీవల బయోసైన్స్‌ మెథడాలజీ కింద టెట్‌కు సిద్ధమవుతోంది. బయోసైన్స్‌ మెథడాలజీలో గణితం సబ్జెక్టును చేర్చడం సహేతుకం కాదని, సంబంధం లేని ఆ సబ్జెక్టులో రాణించాలంటే ఇబ్బందిగా ఉందని ఆమె బాధపడేది. ఈమేరకు ఈనెల 5న గణితాన్ని తొలగించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి తనవద్దే ఉంచుకుంది.

అనంతరం శనివారం (మే 7న) హెయిడ్‌ డై (జుత్తుకు పూసుకునే రంగు)ను తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబసభ్యులు హుటాహుటిన దేవరకొండ ఆస్పత్రికి, అక్కణ్నుంచి హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+