అర్ధరాత్రి తప్పతాగి బెంజ్ కారులో వచ్చి పోలీసులకు చుక్కలు చూపిన యువతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద మందుబాబులు రెచ్చిపోయారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా మొత్తం 105 మంది మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డారు. మద్యం మత్తులో యువతులు పోలీసుల పైనే రెచ్చిపోయారు.

ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఓ యువతి అయితే పోలీసులకు చుక్కలు చూపించింది. ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో వారు ఆమెను వెంబడించారు. చివరకు పట్టుకున్నారు.

బీజేపీపై బాబు 'చేరికల' అసహనం: సాయంపై ట్విస్ట్, లెక్కతో ఇరకాటంలో బాబు, కొత్త ప్రశ్నలు!

వెంబడించి యువతి కారు పట్టుకున్నారు

వెంబడించి యువతి కారు పట్టుకున్నారు

ఆ యువతి కారును పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెపై నమోదు చేశారు. ఆమెను హైదర్‌గూడకు చెందిన కీర్తిగా గుర్తించారు. ఆమె జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మీదుగా రోడ్డు నంబరు ఒకటిలోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వైపు బెంజ్ కారులో వచ్చింది. అక్కడ పోలీసులు ఆమె కారును ఆపే ప్రయత్నం చేశారు.

కారు వేగం పెంచింది

కారు వేగం పెంచింది


కారును నిలిపినట్లు నమ్మించిన ఆమె ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచింది. పోలీసులు పట్టుకునేందుకు రోడ్డుకు అడ్డంగా బౌల్డర్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఛేజ్‌ చేసి కారును ఆపారు. ఆమె డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలకు సహకరించలేదు. చివరికి పరీక్షించగా 36 బీఏసీగా నమోదవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేశారు.

85 కేసులు నమోదు

85 కేసులు నమోదు


జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలోని ఆరు ప్రాంతాల్లో చేసిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల్లో మొత్తం 85 కేసులు నమోదయ్యాయి. ఇందులో మద్యం తాగి వాహనం నడుపుతున్న వారికి చెందిన 42 కార్లు, 43 బైకులపై కేసులు నమోదు చేశారు.

వాహనాలు స్వాధీనం

వాహనాలు స్వాధీనం

రేసింగులు, ప్రమాదకరంగా వాహనం నడుపుతున్న మరో రెండు కార్లను, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ తాము విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న మందుబాబులు మెట్టు దిగడం లేదని చెప్పారు. తనిఖీలు మరింత పెంచుతామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Girl hulchul at Jubilee Hills check post in night while drunk and drive tests.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి