తెలంగాణలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్
తెలంగాణలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2008 డీఎస్సీ అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాలకు పరిశీలకులను నియమించింది. నవంబర్ 8వ తేదీ లోపు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది.
నిర్ణీత ప్రొఫార్మాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని సూచించింది. కాగా, కాంట్రాక్ట్ ప్రాతిపదికన డీఎస్సీ 2008 అభ్యర్థులను తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో కార్యాలయాల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది.

హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. డీఈడీ ఉన్నవారికి 30 శాతం ఎస్జీటీ పోస్టులు కేటాయించింది. 30 శాతం రిజర్వేషన్ వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1200 మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరునుంది. అంతేగాక, వారి 16 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆ తర్వాత పలు కారణాలతో నవంబర్ 7 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.
కాగా, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటికే ఫలితాలు కూడా విడుదల అయ్యాయి.
ఇక రెండో టెట్‌కు నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేస్తామని గతంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ పేపర్-1కు డీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు కాగా... టెట్ పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు.












Click it and Unblock the Notifications