రైతులకు తెలంగాణా సర్కార్ శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతుంది. రైతులకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూనే, రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్స్ ల తరహాలో రైతుల సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ అంబులెన్స్ లను అందుబాటులోకి తెచ్చింది.
రైతుల విద్యుత్ సమస్యలు పరిష్కరించే ప్లాన్
వ్యవసాయ పనుల కోసం వినియోగించే విద్యుత్ సమస్యలు చోటు చేసుకోకుండా, రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం విద్యుత్ అంబులెన్స్ లను ప్రవేశపెట్టింది. 1912 నంబర్ కు రైతులు కాల్ చేయగానే మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, థర్మల్ విజన్ కెమెరాలతో కూడిన వాహనం, ఇంజనీర్, ఇతర సిబ్బందితో సహా వచ్చి యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తుంది.

రైతుల కోసం విద్యుత్ అధికారులే పొలం బాట
అంతేకాదు అధికారులు వారంలో మూడు రోజులు రైతుల పొలాలలో ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించిన ప్రభుత్వం ఆ పనిని కూడా మొదలు పెట్టింది. శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ పై జరిగిన చర్చలో ఈ కీలక విషయాలను వెల్లడించారు. తమ ప్రజా ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందించడానికి ఈ రంగాన్ని పటిష్టం చేస్తోందని చెప్పారు.
రెండేళ్లలో దాదాపు రెండు లక్షల అదనపు విద్యుత్ కనెక్షన్లు
గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తుందని ఆయన తెలిపారు. రైతులకు విద్యుత్ సమస్యల పైన తక్షణ పరిష్కారం చూపిస్తూ చర్యలు చేపడుతున్నామన్నారు. గత రెండేళ్లలో దాదాపు రెండు లక్షల అదనపు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్టు తెలిపారు.
మరో 9700 మంది రైతులకు ట్రాన్స్ఫార్మర్లు
ఎటువంటి వివక్ష లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని మరో 9700 మంది రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కూడా అందిస్తామని పేర్కొన్నారు. అదనపు లోడ్ అవసరమున్న రైతులకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు, అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక విషయాలను వెల్లడించారు.












Click it and Unblock the Notifications