ఓరుగల్లు వాసులకు గుడ్ న్యూస్.. హెల్త్ హబ్ గా వరంగల్!
తెలంగాణ రాష్ట్రంలో 8 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చిన ఘనత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిదని, హైదరాబాద్ తర్వాత అంతటి చరిత్ర కలిగిన ఓరుగల్లు కు వైద్య ఆరోగ్యరంగంలో పెద్దపీట వేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఓరుగల్లును హెల్త్ హబ్ గా తీర్చి దిద్దుతామన్నారు. ఎటువంటి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కు అయినా ఓరుగల్లును కేంద్రంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు.
నర్సంపేట మెడికల్ కళాశాలను, ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ
ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని, మెడికల్ కళాశాల భవనాన్ని రెవెన్యూ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖలతో కలిసి ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నారు. వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా ఉండాలని, ప్రజలకు ఏ కొరత లేకుండా ఉండాలనేదే తమ లక్ష్యం అన్నారు.

రాబోయే రోజులలో వైద్య సిబ్బందికి కొరత లేకుండా చూస్తాం
రానున్న రోజుల్లో వరంగల్ కు క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ తీసుకువస్తామని, ఐ వి ఎఫ్ సెంటర్ తో పాటు ట్రామా సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. రాబోయే రోజులలో వైద్య సిబ్బందికి కొరత లేకుండా చూస్తామని వైద్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నర్సంపేట మెడికల్ కళాశాలకు 181 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు.
విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత
తమ ప్రభుత్వ హయాంలో విద్యకు, వైద్యానికి ప్రాధాన్యతను ఇస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.హైద్రాబాద్ తరువాత అంత చరిత్ర కలిగిన ప్రాంతం ఓరుగల్లు ప్రాంతం అని, అలాంటి ఓరుగల్లు ప్రాంతాన్ని సుమారు 9 ఏళ్లుగా నాశనం చేసారన్నారు.ఓరుగల్లును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకున్న నాథుడే లేడు...కానీ రేవంత్ రెడ్డి పట్టించుకుని బాగు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఉస్మానియాకి, గాంధీకి హాస్టల్ బిల్డింగ్స్ ను మంజూరు చేశాం
ఉస్మానియాకి, గాంధీకి హాస్టల్ బిల్డింగ్స్ ను మంజూరు చేశామన్నారు.గత ప్రభుత్వం గాలికి GO ఇచ్చి బాధ్యత నిర్వహించలేదు,కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకుని పనులు పూర్తి చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని విధాల అభివృద్ధి చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
రేవంత్ ప్రభుత్వ పాలన పారదర్శక పాలన
ఇంత వరకు ఏ ప్రభుత్వం లో జరగని ట్రాన్స్ ఫర్ లు పారదర్శకంగా చేసిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్మారని, ప్రజాస్వామ్య పద్ధతి లోనే ఓట్లేసి కాంగ్రెస్ ను గెలిపించారని, ఇచ్చిన మాట మేరకు మా ప్రభుత్వం ఏ ఏ హామీలు ఇచ్చింది అదే మాట నిలబెట్టుకొనే ప్రయత్నంలో ఉన్నామన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications