సీఎం కేసీఆర్ కు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వినతి .. కేసీఆర్ స్పందిస్తారా ?

Recommended Video

    టీచర్ల సమస్య పై KCR కి విజ్ఞప్తి చేసిన బాలిక | Student Appealed CM KCR That They Want Teachers

    తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైనా నేటికీ వివిధ పాఠశాలల్లో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక 4వ తరగతి విద్యార్థిని తమ పాఠశాలలోని సమస్యపై కేసీఆర్ స్పందించాలి అంటూ చేసిన వీడియో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక వీడియో మెసేజ్ లో మాట్లాడిన బాలిక పేరు సౌభాగ్య. గద్వాల జిల్లా లోని పెద్ద ధన్వాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న సౌభాగ్య తమ గవర్నమెంట్ పాఠశాల లో కనీసం ఒక్క టీచరు కూడా పాఠాలు చెప్పడానికి లేరని, విద్యా బోధన చేసే వారు లేక తాము ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొంది , తమకు ఒక టీచర్ ను పంపించాల్సిందిగా కోరుతున్నాము అని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేసింది.

    పాఠశాలలు ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా పాఠశాలల పరిస్థితి ఏవిధంగా ఉంది, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు అనేది సౌభాగ్య మాట్లాడిన మాటలతో అర్థమవుతుంది.వ్యవసాయ భూములకు సంబంధించి ఇబ్బంది అని కేసీఆర్ కు మొరపెట్టుకున్న వ్యక్తి వీడియో మెసేజ్ స్పందించిన కేసీఆర్ అధికారులను పుగులు పెట్టించారు . సోషల్ మీడియా లో వచ్చిన పిర్యాధుపై స్పందించిన తెలంగాణ సిఎమ్ కేసిఆర్ , రైతుతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను ఆదేశించారు .

    Government school student appeal to CM KCR .. What is the matter ?

    వెంటనే సంబంధిత రైతు గ్రామాన్ని పరీశీలించిన మంచిర్యాల కలెక్టర్ హుటాహుటిన ఆ రైతు సమస్య పరిష్కారానికి పని చేశారు. మరి ఇప్పుడు పాఠశాలలో సమస్యలపై సీఎం దృష్టిసారించాలని ఒక 4వ తరగతి బాలిక చేసిన వీడియో మెసేజ్ పై ఏ విధంగా స్పందిస్తారో .. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టీచర్ల కొరత వేధిస్తున్నది అని సౌభాగ్య మెసేజ్ ద్వారా అర్థమవుతుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+