నాకు అన్నీ తెలుసు, నన్ను ఎవ్వరు ఏమన్నా పట్టించుకోను: గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: నారాయణగూడలోని డయాగ్నోసిస్ సెంటర్‌ను గవర్నర్ నరసింహన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకేచోట అన్ని పరీక్షలు నిర్వహించి 24 గంటల్లో ఫలితాలు ఇచ్చే కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషి జరుగుతోందన్నారు.
మోడల్ హెల్త్‌కేర్ సెంటర్‌గా తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. మంత్రి, అధికారులు అందరూ కష్టపడుతున్నారని కితాబిచ్చారు. తాను అన్ని శాఖల పైన దృష్టి పెట్టానని చెప్పారు. ప్రతిపక్షాలతో పాటు తనను ఎవరు ఏమన్నా పట్టించుకోనని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పరిశీలనకు వ్యక్తిగతంగా వెళ్లానని చెప్పారు.

నేను పూజకు వెళ్లినా ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు. తాను చెప్పి చేసినా, చెప్పక చేసినా ఆరోపణలు చేస్తున్నారని గవర్నర్ అన్నారు. ఎవరో ఏదో చెప్తే తాను నమ్మే వ్యక్తిని కాదన్నారు. తనకు అన్ని విషయాలు తెలుసునని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications