తెలంగాణలో గ్రూప్-1 ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షల మొత్తం 563 పోస్టులకు గానూ, 31,403 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను అధిగమించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
గ్రూప్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజినల్ మార్కులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసింది. https://websitenew.tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో మార్కులు చెక్ చూసుకోవచ్చు.

తమ మార్కులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్దిష్ట గడువులోగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇక గ్రూప్-2 ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నెల 20లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలను వెల్లడించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకూ గ్రూప్-1 మెయిన్ పరీక్షలు జరిగాయి.












Click it and Unblock the Notifications